విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు.సభను గౌరవించాలని కోరారు.స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన విపక్ష నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు.షేమ్ని,షేమ్ అంటూ విపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు.విపక్ష నినాదాల మధ్యనే ప్రధాని ప్రసంగించారు.దేశ సేవ చేయడానికి ప్రజలు తమకి అవకాశం ఇచ్చారని మోదీ తెలిపారు.తమ పాలనలో ఇప్పటివరకు ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.140 కోట్ల మందికి సేవ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.