రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీను కలిశామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి గురువారం ప్రధాని మోదీ మరియు అమిత్ షాతో భేటీ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని ప్రధానితో కోరినట్టు తెలిపారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై, వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.మరోవైపు విభజన హామీల పరిష్కారం కోసం కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.తాము వివరించిన అంశాల పై ప్రధాని సానుకూలంగా స్పందించారని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మీడియాతో మాట్లాడారు.ఏపీలో విలీనమైన 05 గ్రామాలను తెలంగాణలో కలపాలని ప్రధాని మోదీతో కోరామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లులు మంజూరు చేయాలనీ,జిల్లాల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలనీ కోరినట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Must Read