టీ 20 ప్రపంచకప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది.మొదటిగా బ్యాటింగ్ చేసిన టీంఇండియా 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికా కి 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి అదరగొట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్ డాక్ అవుట్ అయి వెనుదిరిగాడు.సూర్యకుమార్ 03 చేయగా తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ 47 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఆఖర్లో బ్యాటింగ్ చేసిన దుబే 27 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టీ20 ప్రపంచకప్ లో టీంఇండియా ఘన విజయం సాధించడం పై యావత్తు దేశం భారత జట్టు పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది.దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.రోడ్ల పైకి వచ్చి టపాసులు కలుస్తూ భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.మరో వైపు ప్రముఖులు,రాజకీయనేతలు కూడా టీంఇండియా పై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ టీంఇండియా పై ప్రశంసల వర్షం కురిపించారు.భారత్ క్రికెట్ జట్టును చూసి దేశం గర్విస్తుందని తెలిపారు.ఈ సందర్బంగా టీంఇండియాకి శుభాకాంక్షలు తెలిపారు.స్వయంగా ప్రధాని మోదీ టీమిండియా ఆటగాళ్లతో ఫోన్లో మాట్లాడారు.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అభినందించారు.అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీను ప్రధాని కొనియాడారు.