- జి7 సమ్మిట్ కి ఇటలీ వెళ్లిన మోడీ
- ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన మోడీ
- వివిధ దేశ అధినేతలతో సమావేశమైన మోడీ
మూడోసారి దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.గురువారం ప్రధానిమోడీ ఇటలీ వేదికగా జరుగుతున్నా జి.7 సమ్మిట్ కి బయల్దేరి వెళ్లారు.నేడు (శుక్రవారం) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్‌స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయి అనేక విషయాల పై చర్చించారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ తో భేటీ అయిన మోడీ కీలక విషయాల పై చర్చించారు.
రక్షణ,అణు,అంతరిక్ష,విద్య,డిజిటల్ ఇతర మౌలిక వసతుల పై చర్చలు జరిపారు.ఈ చర్చలతో రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సవాళ్ళను అదిగిమించడంతో పాటు అంతర్జాతీయ సహకారం సాధించే దిశగా అడుగులు పడతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.