రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం.
మరోవైపు తప్పించుకున్న ఖైదీలు భారత్ లోకి చొరబడే అవకాశం ఉందని బంగ్లా సైనికులు బీఎస్ఎఫ్ దళాలకు సమాచారం అందించాయి.దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశాయి.