Friday, September 20, 2024
spot_img

అడ్డదారిలో ప్రమోషన్

Must Read
  • ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ డా. రజినీరెడ్డిపై ఆరోపణలు
  • కనీసం సీనియార్టి లిస్ట్ లో లేకుండానే హాస్పిటల్ ఇంఛార్జీ పోస్ట్
  • 2022లో ప్రొఫెసర్ అర్హత సాధించినా.. తొలుత ఆమెకే ప్రాధాన్యత
    ఫైరవీ ద్వారా ఉన్నత పోస్టుల నియామకం.
  • ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ గా అనేక అక్రమాలు.?
  • కేసులు ఉన్నవారినీ తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్న వైనం
  • ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వద్ద నుంచి నెల నెలా కమిషన్లు
  • పైగా మంత్రి అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులు
  • తనకు ఫుల్ సపోర్ట్ ఉంది ఏం చేయలేరంటూ సవాల్

‘వడ్డించే వాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్న తునకలు పడతాయన్నట్టు’ వైద్యారోగ్య శాఖలో ఓ డాక్టర్ కు కీలక పదవీ దక్కింది. కనీసం ప్రమోషన్ లిస్ట్ లో లేకుండానే దర్జాగా హాస్పిటల్ సూపరింటెండెంట్ పోస్ట్ కొట్టేసింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్దతిలో కాకుండా అక్రమ మార్గంలో ఆస్పత్రి ఇంఛార్జి పదవీ ఆమెకు ఎలా దక్కిందనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీలోని ప్లేట్ల బుర్జు ప్రసూతి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ గా డాక్టర్ రజినీరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన అపాయింట్మెంట్ అయింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నాటినుంచి పదోన్నతి పొందేవరకు అన్ని ‘ఆన్ రికార్డు’ ఉంటుంది. సర్వీసు బుక్ ఆధారంగా ఆయా పోస్టు, కేటగిరి ప్రకారం ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్లేట్ల బుర్జు మెటర్నటీ సూపరింటెండెంట్, హాస్పిటల్ ఇంఛార్జీ డా.రజినీరెడ్డి కేవలం ఫైరవీ ద్వారానే ఈ పోస్టులో నియామకం అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి డాక్టర్ రజినీరెడ్డి 2022లో అసోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ కావడం జరిగింది. అప్పటి వరకు ఆమెకు సూపరింటెండెంట్ అయ్యే అర్హత లేదు. కేవలం రెండేళ్లకే రాజధానిలోని నెం.1 మెటర్నటీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ గా పోస్ట్ కొట్టేసింది అంటే ఆ లేడి డాక్టర్ ఫైరవీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ రజినీ రెడ్డికన్నా ముందు 2020-21, 2021-22లో ప్రొఫెసర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లూ కూడా సూపరింటెండెంట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్నరు.

‘నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది’ అనే సామెత నిజం చేసింది. కాకపోతే పలుకుబడి ఉపయోగించి ప్రమోషన్ సంపాదించింది. ఇదంతా ఇటుంచితే సూపరింటెండెంట్ సీటులో కూర్చుని దవాఖాన అంతా తనదే అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. ప్లేట్ల బుర్జు హాస్పిటల్ ఇంఛార్జిగా కొనసాగుతూ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో సస్పెండ్ అయిన పోస్టింగ్ :
పీజీ విద్యార్థుల వద్ద డబ్బు తీసుకొని మాల్ ప్రాక్టీస్ కు సహకరించినందుకుగాను సస్పెన్షన్, రిమూవ్ అయిన ఇద్దరినీ ప్రస్తుత సూపరిటెండెంట్ డాక్టర్ రజినీ రెడ్డి కొలువులోకి తీసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. గత ఫిబ్రవరిలో వాళ్లను తిరిగి పోస్టింగ్ లోకి తీసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ క్రాంతికుమార్ ను తిరిగి తీసుకోని అదే పోస్ట్ లో కూర్చొపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే ఔట్ సోర్సింగ్ లో సూపర్ వైజర్ గా పనిచేసిన వెంకట్ ను కూడా అధికారులు తొలగించినా.. ప్రస్తుతం ఆయనను మళ్లీ తీసుకొచ్చి అదే స్థానం సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్ వైజర్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. పోలీసు కేసులు ఉండి సస్పెన్షన్ కు గురైన వారినీ సేమ్ పొజిషన్ లోకి తీసుకొని పైసలు వసూలు చేసి సహకరించేందుకు రిక్రూట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నయి.

ఏజెన్సీ వద్ద నుంచి కమిషన్లు వసూలు :
ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ రజినీ రెడ్డి పైసలు పెట్టి ప్రమోషన్ కొట్టేసిన డాక్టర్ మేడం.. అదే తనువుగా డబ్బులు సంపాదించడంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా ఆమెకు ఏజెన్సీ నెలనెలా కొంత డబ్బులు ఇస్తున్నట్టు చెబుతోంది. ఉద్యోగులకు రూ.2వేలకు పైగా కట్ చేస్తున్నందున ఇదే విషయమై ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని ప్రశ్నించగా.. ప్రతినెలా బిల్లు పాస్ చేయాలంటే సూపరిటెండెంట్ పర్సంటేజ్ (మాముళ్లు) ఇవ్వాలె అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎంప్లాయిస్ కు సంబంధించిన అటెండెన్స్ గురించి వివరాలు సబ్మిట్ చేసే సమయంలో పనితీరు 100 శాతానికి 96% పర్సెంటేజ్ ఇస్తేనే పూర్తి బిల్లు పాస్ అవుతుంది. లేదంటే 5 నుంచి 10% డబ్బులు కట్ అవుతాయే.. అందుకోసమే సూపరింటెండెంట్ కు ప్రతినెలా ఉద్యోగుల జీతాల్లోంచి కట్ చేసి మాముళ్లు ఇవ్వాల్సి వస్తుందని ఏజెన్సీ నిర్వాహకులు వెల్లడించారు.

ఈ రెండు ఇష్యూలపై ఆదాబ్ హైదరాబాద్ లో కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. మరోవైపు ఆరోగ్యశాఖ మంత్రి అండదండలు తనకు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఎవరూ ఏమైనా అడిగితే తనకు ఫుల్ సపోర్ట్ ఉన్నది మీరే చేయలేరంటూ బుకాయిస్తుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, దొంగదారిలో ప్రమోషన్ కొట్టిసినా వైద్యారోగ్య శాఖ డాక్టర్ రజినీ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ప్లేట్ల బుర్జు ఆస్పత్రి సూపరింటెండెంట్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This