Friday, November 22, 2024
spot_img

కాలం చెల్లిన అంగవైకల్య సర్టిఫికేట్ తో ప్రమోషన్స్

Must Read
  • డీఎంహెచ్ఓ ఆఫీస్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకటరమణ
  • ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా సర్టిఫికేట్ జారీ
    జిల్లా కలెక్టర్ కి రమేష్ గౌడ్ ఫిర్యాదు

ఫేక్ సర్టిఫికేట్ తో డా.పి వెంకటరమణ ట్రాన్స్ ఫర్లతోపాటు ప్రమోషన్స్ పొందుతున్నారు. సూర్యాపేట డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకట రమణ కాలం చెల్లిన మాన్యూవల్ అంగవైకల్య సర్టిఫికేట్ 25% తో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పొందినట్లు జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు.

పి వెంకటరమణ ఈ ధ్రుపత్రాన్ని అడ్డుపెట్టుకొని 2013 నుండి 2022 డిసెంబర్ వరకు నెలకు రూ. 2000 అలవెన్సులు, ఐ.టీ రాయితీలు, ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్స్ పొందుతున్నట్లు ఆరోపిస్తూ వావిళ్ళ రమేష్ గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. మ్యానువల్ సర్టిఫికెట్స్ వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జీ.ఓ ఎం.ఎస్ నెం 31 అనుసరించి 1 డిసెంబర్ 2009 మాన్యూవల్ సర్టిఫికెట్ లను రద్దు చేయడం జరిగింది. కొత్తగా 2010 నుండి సదరన్ సర్టిఫికెట్లు పొంది, 40 శాతం పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం నుండి రాయితీలు పొందాలని నియమ నిబంధనలు ఉన్న, ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ తనకున్న అధికార బలంతో 2013న మ్యనువల్ అంగవైకల్యం సర్టిఫికెట్ పొంది అన్నిరకాల అవసరాలు తీర్చుకుంటునట్టు ఆరోపణలు ఉన్నాయి. డా. పి. వెంకటరమణకు అంగ వైక్యలం లేకున్నా 25 శాతం ఉన్నట్టు సర్టిఫీకేట్ మంజూరు చేసిన డాక్టర్స్ పై.. అక్రమంగా సర్టిఫికెట్ తో రాయితీలు పొందిన డాక్టర్ వెంకటరమణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS