భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కి భద్రతా కల్పించి,బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ప్రభుత్వం జగన్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదని జగన్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు.బులెట్ ప్రూఫ్ నిర్వహణ ఎవరిదీ అని హై కోర్టు ప్రశ్నించింది.బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇంటిలిజెన్స్ దాని అడ్వాకెట్ జనరల్ తెలిపారు.జగన్ కి వేరే వాహనం లేదా జామర్ కేటాయించవచ్చు కదా న్యాయమూర్తి ప్రశ్నించారు.వాహనాలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకొని చెప్తామని అడ్వాకేట్ జనరల్ తెలిపారు.ఏపీలో జరుగుతున్నా హింసాత్మక ఘటనల వల్ల జగన్ కి ప్రాణహాని ఉందని అయిన తరపున న్యాయవాది పేర్కొన్నారు.చట్టప్రకారం ఇవ్వాల్సిన భద్రతను జగన్ కి ఇస్తున్నామని అడ్వాకెట్ జనరల్ తెలిపారు.పూర్తీ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనీ కోర్టు ఆదేశించింది.తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.