Monday, July 21, 2025
spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాల‌న‌

Must Read
  • ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు
  • ప్రతిపక్ష అసత్య ప్రచారాలు నమ్మవద్దు
  • రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ పీసీసీ మెంబర్ బండ రాంరెడ్డి

“కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది కుటుంబాల్లో ఆనందం నింపింది, పిల్లల భవిష్యత్తుకు వెలుగు చూపింది, రైతులకు భరోసా ఇచ్చింది, మహిళలకు గౌరవాన్ని ఇచ్చింది, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు ఇది నిలకడగా కొనసాగేలా, మరింత శక్తిగా ముందుకు వెళ్లేలా మనం ఏకం కావాలి,” అని రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ పీసీసీ మెంబర్ బండ రాంరెడ్డి స్ప‌ష్టం చేశారు. “ప్రజలకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. ప్రతి కుటుంబానికి మేలు కలిగించే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఆర్థికంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తోంది” అని రాంరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి త‌క్కువ కాలంలోనే ప్రజలకు నచ్చే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి వందలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిందని రాంరెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కీలక పథకాలు:
ఉచిత బస్సు ప్రయాణం: మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా రోజువారీ ఖర్చును తగ్గించడం, విద్యార్థినులకు, ఉద్యోగినులకు ఆర్థిక భారం లేకుండా ప్రయాణ సౌలభ్యం కల్పించడం.

ఆరోగ్యశ్రీ మరింత బలోపేతం:
పేదలకు అత్యాధునిక వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి లక్షల మంది కుటుంబాలను ఆర్థిక భారం నుండి విముక్తం చేయడం.

ఉచిత కరెంట్:
రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ అందించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడం, పంట దిగుబడులు పెరగడానికి సాయం చేయడం.

రూ. 500కే గ్యాస్ సిలిండర్:
ప్రతి గృహానికి తక్కువ ధరలో గ్యాస్ అందించడం ద్వారా గృహిణుల ఆర్థిక భారం తగ్గించడం.

రుణమాఫీ, రైతు భరోసా:
రైతులపై ఉన్న అప్పులను దశలవారీగా మాఫీ చేయడం ద్వారా వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాకుండా చేయడం, ఖరీఫ్, రబీ కాలాల్లో నేరుగా ఆర్థిక సాయం చేయడం.

సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు:
ప్రతి పేదింటికి నాణ్యమైన బియ్యం, సరళంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా ఆహార భద్రత కల్పించడం.

ఇందిరమ్మ ఇండ్లు:
ఇల్లు లేని పేదలకు సొంత గృహం కల్పించడం ద్వారా జీవన స్థితి మెరుగ్గా మారేలా చేయడం.

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు:
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి కోసం పెట్రోల్ బంకులు, మహిళా బృందాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశం.

బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ:
సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లను విస్తరించడం, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం ద్వారా ఉపాధి, విద్యా అవకాశాలు అందించడం.

హైడ్రా, ఈగిల్” ప్రాజెక్టులు:
నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి, స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌లో భాగంగా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం.

మెట్రో ఫేజ్-2, ట్రిపుల్ ఆర్‌:
మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని వేగవంతం చేయడం.

విదేశీ పెట్టుబడులు, ఉపాధి:
2 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించడం ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం.

30 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 65 ఏటీసీ:
ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రతి వర్గానికి వైద్యం అందించగల సామర్థ్యాన్ని పెంచడం.

చెరువుల సుందరీకరణ:
నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా నగరానికి త్రాగు నీరు, సాగునీరు అందించడం.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్:
యువతకు నైపుణ్యాభివృద్ధి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం.

ఇది కదా నిజమైన ప్రజా పాలన అంటే..
ఇలా ఒకేఒక్క ప్రభుత్వం ఇలా సమగ్రంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని, అన్ని రంగాల్లో అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్లగలదని బండ రాంరెడ్డి తెలిపారు. “ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నాయి. కానీ సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. పథకాల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు నిజాన్ని మరొకరికి చెప్పడం ద్వారా నిజమైన ప్రజా పాలనకు బలమివ్వాలి” అని పిలుపునిచ్చారు.

వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మీ ఓటు శక్తితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేకూర్చి, ప్రతి పథకం స‌ద్వినియోగం చేసుకునేలా.. మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబ సంక్షేమం కోసం, మీరు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల‌ని బండ రాంరెడ్డి పిలుపునిచ్చారు.

Latest News

మెదడు ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే జీవితానికే ముప్పు!

వేగంగా మారుతున్న జీవనశైలిలో… మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు! తొలినాళ్ల లక్షణాలే హెచ్చరికలు.. వెంటనే స్పందించాలి : కేర్ వైద్యులు మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS