- తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
దేశంలో సంక్షేమ పథకాల అమల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.103 వ జయంతి సంధర్భంగా శుక్రవారం నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమిలో ఉన్న స్మారక స్థలం వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పీవీ నరసింహా రావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా,దేశ ప్రధానిగా చేసిన సేవలను డాక్టర్ వకుళాభరణం కొనియాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా,దేశంలో ప్రధానమంత్రిగా బీసీలకు విద్యా,ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను అమలులోకి తెచ్చిన ఘనత పీవీ దే అని అన్నారు.కార్పొరేట్ విద్యను పేదలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలను,దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పింది పీవీ నే అని తెలిపారు.జాతీయ స్థాయిలో పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే,జాతీయ స్థాయిలో బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్ లు బీసీ ఆర్ధిక కార్పొరేషన్ లు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే, దేశం ప్రగతిపథంలో ముందుకు వెళ్ళటానికి సాధ్యం అని భావించిన పీవీ, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టరాని వెల్లడించారు.తన స్వస్థలం హుజూరాబాద్ సమీపంలోని వంగర గ్రామంలో జన్మించి ,పీవీ అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి వరకు ఎదగడం తనలాంటి వారికి జీవితంలో గొప్ప అనుభూతిని ఇచ్చే అంశామని తెలిపారు.