Friday, September 20, 2024
spot_img

అక్ర‌మాలు చేయ‌డంలో, రాజీప‌డ‌ని రాధా..

Must Read
  • అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్
  • స‌ర్వే నెంబ‌ర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, క‌బ్జాదారుల‌పై క్రిమినల్ కేసులు పెట్టామ‌న్న ఎమ్మార్వో
  • కానీ, నిర్మాణాలు కూల్చివేయ‌కుండా, ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌కుండా లోపాయికారి ఒప్పందాలు
  • తప్పించుకునే ప్రయత్నంలో తహశీల్ధార్ రాధా
  • 423ఎకరాల భూమికి గాను.. మిగిలింది వంద ఎకరాలే
  • ప్ర‌భుత్వ భూమి క‌బ్జా చేస్తే చ‌ర్య‌లు తీసుకొని క‌లెక్ట‌ర్‌
  • ఆదాబ్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారి
  • స‌ర్కార్ భూములు ఫ‌ర్ సేల్‌ అనే శీర్షికతో ఆదాబ్ లో కథనం
  • అమీన్ పూర్ రెవెన్యూ అధికారుల గుండెల్లో వణుకు
  • ఎమ్మార్వో రాధాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల డిమాండ్‌

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు అప్పనంగా అప్పజెప్పేస్తున్నారు. నాది కాదులే, నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా వందల ఎకరాల భూమి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవడమే కాదు కబ్జాకోరులకు ఆఫీసర్లు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో చాలా చోట్ల అసైన్డ్ భూములపై అక్రమార్కులు కన్నేసి కాజేస్తున్నారు. చెట్లు, పుట్టలు, గుట్టలను కబ్జాచేసి ప్రభుత్వ భూములు లేకుండా చేశారు. పాలకుల ఫుల్ సపోర్ట్ తో కిందిస్థాయి లీడర్లు సైతం ఖాళీగా జాగలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొన్నిచోట్ల బయటపడుతున్నా, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కబ్జా ల్యాండ్లు గురించి సెటిల్ మెంట్ చేసుకుంటున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు ఏకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తూ.. క‌బ్జా భూముల‌ను కాపాడుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు.. ఆక్రమణదారులకు ప్రభుత్వ అధికారులు సైతం అండగా నిలువడం గమనార్హం. వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా మండ‌లం, మున్సిపాలిటీ అమీన్ పూర్, బీరంగూడ విలేజ్ లో సుమారు వందల‌ ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. మున్సిపాలిటీ అమీన్ పూర్, బీరంగూడ విలేజ్ సర్వే నెం. 993 లో మొత్తం ప్రభుత్వం 423 ఎకరాలు ఉంది. ఇందులో 100 ఎకరాల భూమి మాత్ర‌మే మిగిలి ఉంది.. ఆ మిగిలిన భూమిని కూడా కొంద‌రు క‌బ్జాదారులు చేర‌ప‌ట్టి, కృష్ణారావు, ఎంవీవీ సత్యనారాయణ, బి.గోపాల్, పి.మహిపాల్ రెడ్డి ల అనుచ‌రుడైన‌ ఓ రియాల్టర్ ద్వారా 993 సర్వే నంబర్‌లోని సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.

ప్రస్తుత ఎమ్మార్వో ఫుల్ సపోర్ట్ :
బీరంగూడలో సర్వే నెం. 993లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి ప్రభుత్వ భూమిని అమ్ముతున్న వారికి అట్టి సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎలాంటి అర్హత లేకున్నా అమ్మడం విశేషం. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు తేటతెల్లం అవుతుంది. మరోవైపు కబ్జాకోరులకు ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటితో డబ్ల్యూపీ నంబర్ 34885/2023 ఫైల్ చేశారు. కాగా కబ్జాదారులు సర్వేనెంబర్ 993/24, 993/29 సర్వే నంబర్లు చూయిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని అప్పటి తహశీల్దార్ అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. అయితే దీనిపై కోర్టుకు వెళ్లిన అక్రమార్కులు ఆయనపై కంటెంట్ వేశారు. అనంతరం వచ్చిన ప్రస్తుత ఎమ్మార్వో నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ల్యాండ్ పై కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

‘స‌ర్కార్ భూములు ఫ‌ర్ సేల్‌’ అనే శీర్షికతో ఆదాబ్ లో కథనం :
సంగారెడ్డి జిల్లా మండ‌లం, మున్సిపాలిటీ అమీన్ పూర్, బీరంగూడ విలేజ్ లో సర్వే నెం. 993లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి ప్రభుత్వ భూమిని అమ్ముతున్నారని, సర్వే నెం. 993లో 423ఎకరాలకుగాను వందల‌ ఎకరాలు సర్కారు భూమి మాయం అయినట్లు సోమవారం దినపత్రికలో వార్త ప్రచురించడం జరిగింది. అయితే తహశీల్దార్ ను వివరణ కోరగా కబ్జాకు గురైన ప్రభుత్వ ల్యాండ్ లో నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపారు. అదేవిధంగా భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు కూడా ఎమ్మార్వో ఆదాబ్ కు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మార్వో ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం కిష్టారెడ్డిపేట్ లోని స‌ర్వే నెంబ‌ర్ 164లో అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేసి, అక్ర‌మ‌నిర్మాణాదారులు మ‌దుసూద‌న్‌, ర‌ఫిక్‌ల‌పై కేసు న‌మోదు (ఎఫ్ఐఆర్ నెం. 243/2024, తేది 27-04-2024) చేసిన‌ట్లు, మ‌రో స‌ర్వే నెంబ‌ర్ 343, అమీన్‌పూర్ విలేజ్‌, గాలి అనిల్‌కుమార్ పై కేసు న‌మోదు (ఎఫ్ఐఆర్ 441/2023, తేది 06-09-2023), స‌ర్వే నెంబ‌ర్ 1000, అమీన్‌పూర్ మండ‌లం, కె. కృష్ణ, కె. కుమార్‌, కె. స‌త్య‌నారాయ‌ణ‌, కె. రాంచంద‌ర్‌, సారా చంద్ర‌య్య‌, జ‌న‌గాం మ‌ల్ల‌య్య ల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. కానీ, స‌ర్వే నెంబ‌ర్ 993లోని అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌లు, అక్ర‌మ నిర్మాణాదారుల‌పై కేసుల‌కు సంబందించి ఎలాంటి చ‌ర్య‌లు లేక పోవ‌డం విడ్డూరం.. ఈ తతంగం అంతా చూస్తుంటే తహశీల్దార్ ముడుపులు తీసుకోవడం వల్లనే, ఆక్రమణదారులకు ఎమ్మార్వో అండదండలు ఉండడం వల్లే ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు క్లీయర్ గా అర్థమవుతోంది. ఓ ఆఫీసర్ అయి ఉండి కబ్జాకోరులకు సపోర్ట్ చేస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇకనైన ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్ స్పందించి.. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని నిర్మాణాలు కూల్చివేసి, ఆక్రమణదారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని, కబ్జాదారులకు అండగా నిలిచిన తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This