కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు.అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో,దేశ ప్రజలు కూడా అదే చక్రవ్యూహంలో చిక్కుకున్నారని ఆరోపించారు.మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుమంది నియత్రించారని నేటికీ కూడా 6 మంది దీనిని నియంత్రిస్తున్నారని ఆరోపించారు.నరేంద్రమోదీ,అమిత్ షా,మోహన్ భగవత్,అజిత్ దోవల్,అంబానీ,అదానీ ఉన్నారని విమర్శించారు.తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం మోదీ ప్రభుత్వం మూడు బలగాలను ఉపయోగించి దేశంలో చక్రవ్యూహం నిర్మించిందని,కేంద్రం నిర్మించిన ఈ చక్రవ్యూహం దేశప్రజలకు హానికరకంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు.కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షా నేతలపై కక్ష సాధిస్తుందని వ్యాఖ్యానించారు.