ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఊరటను ఇచ్చింది.ఈ సందర్బంగా రైతు రుణమాఫీ పై రాహుల్ గాంధీ స్పందించారు.తెలంగాణ రైతు సోదర సోదరమణులకు శుభాకాంక్షలు..ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేయడం ద్వారా ఉపశమనం కల్పిస్తోందని పేర్కొన్నారు.ఒకవైపు,బీజేపీ దేశంలోని రైతులను అప్పుల ఊబిలో బంధించి,వారి డిమాండ్ మరియు ఎం.ఎస్ .పి యొక్క చట్టపరమైన హామీ అవసరాన్ని తిరస్కరించింది,సాధ్యమైన ప్రతిచోటా వ్యవసాయ కుటుంబాలకు సహాయం అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు.భారతదేశ రైతులకు ఎం.ఎస్.పి యొక్క చట్టపరమైన హామీని అందించడం ద్వారా భారతదేశం ఈ అప్పుల ఊబి నుండి బయటపడుతుందని వెల్లడించారు.