- రామోజీ రావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసింది
ఈనాడు,ఈటీవితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు
- ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారు
- రామోజీ మరణం యావత్తు తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచింది
- తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.
ఈనాడు సంస్థల అధిపతి శ్రీ రామోజీరావు మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.రామోజీ ఫిలింసిటీ లోని రామోజీరావు నివాసంలో ఉన్న అయిన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ ఈనాడు,ఈటివితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు.జర్నలిస్ట్ అనే ప్రతినిధిని బాధ్యతయుతమైన పౌరుడిగా , ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారని గుర్తుచేసారు.చతుర,విపుల,తెలుగు వెలుగు లాంటి పత్రికలను నడిపి తెలుగు కథ,కవిత,నవలా,కథనానికి భాష లోని వివిధ ప్రక్రియలకు ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు.తెలుగు భాషకు పట్టం కట్టారని,రామోజీరావు ఆకస్మిక మరణం యావత్ తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.రామోజీ రావు మరణం పట్ల ప్రగాఢ సంతాపన్నీ ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.