Thursday, November 21, 2024
spot_img

ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌

Must Read
  • ధరణిలో పీవోబీ నుంచి మార్పిడికి రూ. 8లక్షలు డిమాండ్‌
  • జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడిపై ఫిర్యాదు చేసిన రైతు
  • పక్కాగా ట్రాప్‌ చేసిన పట్టుకున్న అధికారులు
  • సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా..
  • ఏసీబీ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ
  • లంచం తీసుకోవాలంటేనే వణుకు పుట్టాలి : సీవీ ఆనంద్‌ ట్వీట్‌

రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్‌ కలెక్టర్‌ రూ.8 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. డబ్బును సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ, సీనియర్‌ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి తన భూమిని తొలగించాలని జక్కిడి ముత్యంరెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డిని కోరారు. అయితే ఈ పనిచేసేందుకు ఆయన రూ.8 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో రైతు ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. ఆ మొత్తాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ను అధికారులు విచారించగా జేసీ భూపాల్‌రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పారు. వెంటనే జేసీకి అతనితో ఫోన్‌ చేయించారు. పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్దకు ఆ డబ్బును తీసుకురావాలని చెప్పాడు. దీంతో మదన్‌మోహన్‌తోపాటు అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. అతని నుంచి డబ్బులు తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా జేసీ భూపాల్‌ రెడ్డిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన అనంతరం.. ఇరువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో నాగోల్‌లోని జేసీ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంటిలో రూ.16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ అన్నారు. లంచం తీసుకుంటామనే ఆలోచన రాకుండా పని చేస్తున్నామని అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, సీనియర్‌ అసిస్టెంట్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వీరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో చాకచక్యంగా పని చేసిందని కొనియాడారు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా తెలియ చేయాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కిన విషయాన్ని షేర్‌ చేస్తూ ఎక్స్‌ ఖాతాలో సీవీ ఆనంద్‌ ట్వీట్‌ చేశారు.

Latest News

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్‎లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS