Thursday, November 21, 2024
spot_img

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్వదేశానికి చేరుకున్న రాథోడ్ నాందేవ్

Must Read
  • కువైట్-సౌదీ అరేబియా సరిహద్దులో చిత్రహింసలకు గురైన రాథోడ్ నాందేవ్
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన బాధితుడు
  • వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
  • తిరిగి భారత్ కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
  • భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ స్వదేశానికి చేరుకునేలా కృషి చేసిన అధికారులు

కువైట్-సౌదీ అరేబియా సరిహద్దులో చిత్రహింసలకు గురై, స్వదేశానికి చేరుకున్న నిర్మల్ జిల్లా వాసి రాథోడ్ నాందేవ్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒంటెల కాపరి పని కోసమని ఎడారి దేశానికి వెళ్ళిన రాథోడ్ నాందేవ్ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాజమాన్యం చిత్రహింసలను భరించలేక తన వేదనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాథోడ్ నాందేవ్ ను తిరిగి దేశం రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తూ కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ను స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు. తన వేదనను అర్థం చేసుకొని తిరిగి దేశం రప్పించేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాథోడ్ నాందేవ్, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్‌ తదితరులు ఉన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS