- మాజీ సీఎం జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ సీఎం జగన్.శుక్రవారం నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడతూ,వైసీపీ కార్యకర్తల పై దాడి చేస్తున్న నిందితులకు చంద్రబాబు,లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని,దాడుల పై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కేసులు వేస్తామని తెలిపారు.వైసీపీ కార్యకర్తలకు,నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.