- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.దానం నాగేందర్ కి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని ఆరోపించారు.”నేను హైదరాబాద్ లోనే తిరుగుతున్నా ఎక్కడికి రావాలంటూ” ప్రశ్నించారు.దానం నాగేందర్ కి సిగ్గు ఉంటె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.