- ఎంపీ పురందేశ్వరికి నిమ్మరాజు వినతి
కరోనా కష్టసమయంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు,ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సరైన ఆదాయ వనరులు లేక రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికలు కొట్టుమిట్టాడుతున్నాయని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.చిన్న,మధ్య తరహా పత్రికల మనుగడ కోసం ముఖ్యమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసేలా చూడాలని ఎంపీ పురందేశ్వరిని నిమ్మరాజు విజ్ఞప్తి చేశారు.