Friday, September 20, 2024
spot_img

రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు: హరీష్ రావు

Must Read
  • రైతుబంధు పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
  • సాగుకే ముందు రూ 7500 ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి,ఇచ్చిన
    హామీ పై కట్టుబడి ఉండాలి
  • బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షలు పడగానే రైతుబంధు ఇచ్చింది
  • రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు

రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని అని అన్నారు మాజీమంత్రి హరీష్ రావు.నంగునూరు మండలం అక్కేనపల్లిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ రైతుబంధు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని,వెంటనే రైతుబంధు పై ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు.పంట సాగుకు ముందు ఎకరానికి రూ 7500 ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ ఆ హామీ పై కట్టుబడి ఉండాలని అన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబంధు ఇచ్చిందని గుర్తుచేశారు.కోకో సాగుతో ఆయిల్ ఫార్మ్ రైతులకు అదనవు ఆదాయం వస్తుందని,ఫామ్ ఆయిల్ పై కేంద్రం సుంకం మొత్తం ఎత్తేసిందని అన్నారు.దీని వల్ల రైతులు నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులను చిన్న చూపు చూస్తుందని విమర్శించారు.రూ 4000 క్రాప్ మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.జనుము,విత్తనాలు సకాలంలో అందజేయాలని కోరారు.ఇప్పటికే రైతులు ఈ విత్తనాలు దొరకడం లేదని అంటున్నారని గుర్తుచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అని కోరారు.గతంలో చెప్పినట్టు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఫామాయిల్‌పై కేంద్ర సుంకన్ని తగ్గించాలని ఈ సందర్బంగా కోరారు. రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టిన ప్రభుత్వం రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This