Sunday, January 19, 2025
spot_img

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు..!

Must Read
  • అర్ధ‌రాత్రి నిందితుడు విజ‌య్ దాస్‌ను అరెస్ట్
  • సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా గుర్తించిన‌ట్లు వెల్ల‌డి
  • ముంబ‌యి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌ సమావేశం
  • వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్న ముంబ‌యి పోలీసులు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి థానేలో అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు ఆదివారం (జనవరి 19) తెలిపారు. నిందితుడి వద్ద బంగ్లాదేశ్ జాతీయుడని సూచించే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దీక్షిత్ గెడం మీడియాకు వెల్లడించారు. సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా అత‌డిని ఓ రెస్టారెంట్ స‌మీపంలో గుర్తించిన‌ట్లు తెలిపారు. ముంబ‌యి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌ సమావేశం ఏర్పాటు చేసి, కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు చెప్పారు. కాగా, అంత‌కుముందు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేష‌న్‌లో ఓ అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇదిలాఉంటే.. గురువారం నాడు తెల్ల‌వారుజామున సైఫ్‌పై బాంద్రాలోని ఆయ‌న నివాసంలోనే దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న ప్ర‌స్తుతం లీలావ‌తి ఆసుప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘ‌ట‌నతో బాలీవుడ్ వ‌ర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డాయి.

Latest News

బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల..?

అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌ అవసరంలేదు రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుంది ఈటల కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారు రాష్ట్ర...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS