ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యుల సలహాలు అక్షరాల నిజమని నిరూపించారు 108 సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుకు శ్వాస ఇబ్బందులు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు వెంటనే చిన్నారిని 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా చిన్నారి గుండె ఆగిపోయింది. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆ చిన్నారికి సీపీఆర్ చేశారు. పైలట్ నవీన్, ఈఎంటీ రాజు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకుంటుంది. సకాలంలో సీపీఆర్ చేసిన 108 సిబ్బందిని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రశంసించారు.