- 130 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగన్నాథ రథయాత్ర
130 సంవత్సరాలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర జులై 07న ఆదివారం నిర్వహిస్తున్నట్టు శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని తెలిపారు.ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రతో పాటుగా నగరంలో జగన్నాథ భగవానుడు,బలభద్రుడు మరియు సుభద్ర దేవతల రథయాత్రను నిర్వహిస్తుందని అయిన పేర్కొన్నారు.ఆలయ ద్వారాలు ఉదయం 6:00 గంటల నుండి దర్శనం కోసం తెరవబడతాయని వెల్లడించారు. మధ్యాహ్నం 01 గంటలకు తిరిగి ఆలయ ద్వారాలు మూసివేయబడతాయని అన్నారు. ఆ తర్వాత,ఆలయం నుండి రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమై జనరల్ బజార్ మీదుగా ఎమ్.జి.రోడ్ వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం రాత్రి 6:30 నుంచి 10:30 వరకు హిల్ స్ట్రీట్,రాణిగంజ్ గుండా ఈ రథయాత్ర వెళ్తుందని, మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటుందని శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని వెల్లడించారు.ప్రతీ ఏటా భగవంతుని జగన్నాథ రథోత్సవాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.సికింద్రాబాద్-హైదరాబాద్ జంట నగరాల నుండి భక్తులు భారీగా హాజరై భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారని ఆశించారు.దర్శన నిమిత్తం పైన పేర్కొన్న విషయాలను అందరూ గమనించాలని ఆయన కోరారు.సూచించిన సమయాలకు తదనుగుణంగా దర్శనాన్ని ప్లాన్ చేసుకుని పరమాత్ముని దీవెనలు పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.