- మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది
- మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది
- శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. ప్రతిరోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. మైనర్ బాలికలపై అత్యచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.