Friday, November 22, 2024
spot_img

తమిళిసై తో షా సీరియస్ సంభాషణ..! వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం..!

Must Read

చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాజీ గవర్నర్ తమిళిసై, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య చోటు చేసుకున్న సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది.. అప్పటికే వేదికపై ఆసీనులై ఉన్న అమిత్ షా.. సై వేదికపై కి వస్తూ అందరినీ పలుకరిస్తూ అమిత్ షా ను దాటుకుని వెళ్తున్న సమయంలో ఆమెని వెనక్కి పిలిచిన షా చాల సీరియస్ గా ముఖం పెట్టీ ఆమెతో మాట్లాడటం కెమెరా కంట పడింది… ఆసక్తిగా కనిపించడంతో జూమ్ చేసి మరీ చిత్రీకరించారు వీడియో గ్రాఫర్స్.
తమిళిసైతో మాట్లాడుతూ అమిత్ షా కాస్త సీనియస్‌గా వేలిని చూపిస్తూ ఏవో ఆదేశాలు ఇస్తున్నట్టుగా అనిపించింది. అయితే తమిళిసై మాత్రం నవ్వుతూనే అమిత్ షాకు సమాధానం ఇవ్వడం కనిపించింది. అమిత్ షా మాత్రం చేతిని అడ్డంగా ఊపుతూ కనిపించారు. ఆమెతో సీరియస్‌గా మాట్లాడారు. ఈ ఇద్దరి సంభాషణపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెన్నై దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళి సై బరిలో నిలిచారు. అయితే ఆమె ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ తన సత్తా చాట లేకపోయింది. ఆ క్రమంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, తమిళి సై మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు అమిత్ షా సీరియస్ అయిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డీఏంకే పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలిని ఇలా బహిరంగంగా మందలించడం మర్యాదగా ఉందా? ఇది అందరూ చేస్తారనే విషయాన్ని అమిత్ షా తెలుసుకోవాలన్నారు. అయినా ఇది ఏ తరహా రాజకీయమంటూ ఆయన ఎక్స్ వేదికగా అమిత్ షాను ప్రశ్నించారు.
ఇక తమిళి సై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో తమిళిసైపై అన్నామలై మద్దతుదారులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS