బంగ్లాదేశ్ తాజా పరిణామాలపై తొలిసారి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు.బంగ్లాదేశ్ లో ఆందోళనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఆందోళనల పేరుతో కొందరు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.బంగ్లాదేశ్ జాతిపిత షేక్ మూజిబుర్ రెహ్మాన్ విగ్రహంను ధ్వంసం చేసినందుకు న్యాయం చేయాలని కోరారు.బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆగస్టు 15న జాతీయ సంతాప దినంను గౌరవప్రదంగా జరుపుకోవాలని అన్నారు.దేశ ప్రజలకు ఉద్దేశించి హసీనా చేసిన ప్రకటనను ఆమె కుమారుడు సాజిద్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.