వేదాంత చైతన్య దాస్(హైద్రాబాద్ టెంపుల్ మ్యానజ్ మెంట్ కౌన్సిల్ మెంబెర్ ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్) హైద్రాబాద్, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ఆధ్వర్యంలో.. ఈనెల 7న జగన్నాథ్ రథయాత్ర ఘనంగా నిర్వహించబోతున్నాము. ఈ రదయాత్రను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 108ఆలయాలలో భాగవతం దానం చేయనున్నాము. ఈనెల 7న ఆదివారం NTR స్టేడియం నుండి 11.30AMకి రథయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర NTR స్టేడియం, GPO, మోజంజాహీ మార్కెట్ చౌరస్తా , గాంధీ భవన్ నుండి మరియు 06.00PMకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ముగుస్తుంది. నారాయణగూడ క్రాస్‌రోడ్, YMCA, హిమాయత్‌నగర్ క్రాస్‌రోడ్, TTD టెంపుల్, లిబర్టీ క్రాస్‌రోడ్స్, బషీర్‌బాగ్ క్రాస్‌రోడ్, అబిడ్స్ చెర్మాస్. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పండుగ వేడుకలు జరుగుతాయి. పండుగలో భజనలు, ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. కచేరీ, మహా ఆరతి మరియు ఉచిత ప్రసాదం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్ర, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇస్కాన్ భక్తుల కీర్తనలు. ఊరేగింపులో 150,000 కంటే ఎక్కువ మంది పాల్గొనున్నారు. 6 కి.మీ నాన్‌స్టాప్ రథ యాత్రను భక్తులు స్వయంగా చేతితో లాగుతారు. ప్రజలకు 5 టన్నులకు పైగా వండిన ప్రసాదం పంపిణి చేయనున్నారు. 12000 మందికి పైగా వ్యక్తులు నేరుగా స్వామికి దీప హారతి సమర్పిస్తారు