ప్రతిభా స్ఫూర్తితో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహం ఇవ్వడం తమ లక్ష్యం అని శ్రీరామ్స్ ఐఏఎస్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీరంగం శ్రీ శ్రీ తెలిపారు. 1985 నుంచి విద్యారంగంలో సేవలందిస్తున్న శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్‌లో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శ్రీరామ్స్ ఐఏఎస్ తన ప్రీమియర్ యుపిఎఎస్సీ శిక్షణను విస్తరిస్తూ, విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని అశోక్ నగర్, జవహర్ నగర్‌లో ఉన్న కొత్త సెంటర్ (సుధర్శన్ థియేటర్ ఎదురుగా), అనుభవజ్ఞులైన బోధకులు, యుపిఎస్సీ మెంటార్లతో..యుపిఎస్సీ ఫౌండేషన్ కోర్సు, యుపిఎస్సీ మెంటార్‌షిప్, టెస్ట్ సిరీస్, ఏపిపిఎస్సీ, టీజీపీఎస్సీ టెస్ట్ సిరీస్, ఫౌండేషన్ కోర్సులను అందిస్తుందని వెల్లడించారు. శ్రీరామ్స్ ఐఏఎస్ సిటిఆర్-ఆధారిత బోధన విధానాన్ని అనుసరించి, ఈ కోర్సులు ప్రతి విద్యార్థికి విజయవంతంగా పరీక్షలకు సిద్ధం చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
“దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఢిల్లీలో విద్యార్థులకు సహకారం అందిస్తున్నాము. ఇప్పుడు అదే స్ఫూర్తిని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందించాలనుకుంటున్నాము. హైదరాబాద్‌లో ఉండటం మాకు చాలా సంతోషం అని శ్రీరామ్స్ ఐఏఎస్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీరంగం శ్రీ శ్రీ అన్నారు. “మా బోధకులు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, వారు ప్రతి విద్యార్థి విజయంపై శ్రద్ధ కనబరుస్తారు. శ్రీరామ్ సార్ మనకు నేర్పిన విలువలను వారు పంచుకుంటూ, ప్రతి విద్యార్థిని వారి ప్రత్యేకతను గుర్తించి విజయవంతం అయ్యేలా మార్గదర్శనం చేస్తారు ” అని చెప్పారు.
శ్రీరామ్స్ ఐఏఎస్ వ్యక్తిగతమైన మెంటార్‌షిప్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత ప్రయాణానికి సరైన మార్గదర్శనాన్ని అందిస్తోంది. ఢిల్లీ, పూణే మరియు హైదరాబాద్‌లో ఉన్న తమ కేంద్రాల ద్వారా, ప్రభుత్వ సహాయం లేకుండా కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులకు సేవలందిస్తూ శ్రీరామ్స్ ఐఏఎస్ కొనసాగుతోంది.