కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ I ఐజిపి శ్రీ ఏవి రంగనాథ్
మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణ లో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సదరు ఎస్. ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్. ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది. ఎస్. ఐ పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా మల్టీ జోన్ I ఐ జి పి శ్రీ ఏ. వి. రంగనాథ్ వెల్లడించారు.
Must Read