ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్.ఐ.బి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు.గత నెల జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉండగా,అనారోగ్య కారణాల వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.క్యాన్సర్,గుండే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాని,వైద్యుల సూచనల మేరకు అమెరికాలోనే చికిత్స పొందుతున్నాని తెలిపారు.ఒక పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని లేఖలో వెల్లడించారు.మీడియాకు లీకులు ఇస్తూ తన పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని,తన కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.దర్యాప్తులో భాగంగా పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని,చట్టపరంగా విచారణ జరిపించాలని కోరారు.పూర్తిగా కోలుకున్నాక తానే పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు తెలిపారు.ఇదిలా ఉండగా ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత నెల 23న ప్రభాకర్ రావు పోలీసులకు ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది.