Friday, September 20, 2024
spot_img

సియెర్రా సాప్ట్‌ వేర్‌.. సాప్ట్‌గా మోసం

Must Read
  • వేతనం రాక… కంప్యూటర్‌ ఆపరేటర్ల ఘోస
  • మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం
  • కలెక్టరేట్‌ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ ఆఫీస్‌ల్లో పనిచేస్తున్న 35మంది..
  • 3ఏళ్లుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సైతం చెల్లించని ఏజెన్సీ
  • అయినా సదరు సంస్థపై చర్యలు తీసుకోని ప్రభుత్వం
  • ఆదాబ్‌తో తమ ఘోడు వెళ్ళబోసుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

సర్కార్‌ ఆఫీసులో నౌకరు అంటే ఇగ మీకేంటి చేతినిండా పైసలే కదా అంటారు తెల్సినోళ్లు. కానీ పాపం వీళ్లకు జీతం రాక ఏడాదికిపైగా అయింది. ఇంట్లా ఎట్ల వెళ్లదీస్తున్నరో ఏమోగానీ పైకం కోసం ఎదురుచూసి చూసి కండ్లు కాయలు కాయబట్టే. ‘కోటి విద్యలు కూటి కొరకే ‘ అని పెద్దలు అన్నట్టు పొట్టకూటి కోసం కండ్లుపోంగ కంప్యూటర్‌ ముందు కూర్చొని రోజు పొద్దుగాల తొమ్మిదికొట్టంగా పోయి పనిజేసి రాత్రనంగ ఇంటికొచ్చే వాళ్ల బతుకులు చాలా దయనీయంగా మారినయి. సర్కారు ఆఫీసర్ల కన్న ఎక్కువ అనగా సుమారు రోజుకు 10, 12 గంటలు వర్క్‌ చేసిన పాపం అనిపియ్యట్లేదు. ఇదంతా హైదరాబాద్‌ నడిబొడ్డున ఉండే మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా పరిధిలో ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్ల దుస్థితి. కలెక్టరేట్‌, ఎమ్మార్వో ఆఫీసుల్లో పనిచేస్తున్న తమకు డబ్బులు రాక కుటుం బాలు గడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు. పై ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

మేడ్చల్‌ కలెక్టరేట్‌ సహా ఆయా మండలాల్లోని తహాశీల్ధార్‌ ఆఫీసుల్లో పనిచేస్తున్న 35మంది ఉద్యోగులకు 14నెలలుగా వేతనాలు రావడం లేదు. వివరాల్లోకి వెళితే మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా పరిధిలో ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిమెంట్‌ కోసం ‘సియెర్రా సాప్ట్‌ వేర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకోని కొంతమంది ఉద్యోగులను పెట్టుకొని ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన వర్క్‌ చేపిస్తుంది. గవర్నమెంట్‌ రూల్స్‌ ప్రకారం సదరు సంస్థ అగ్రిమెంట్‌ తీసుకొని వర్కర్లను (కంప్యూటర్‌ ఆపరేటర్లు) పెట్టుకొని కలెక్టరేట్‌ సహా ఆయా మండలాల్లో 35మందిని నియమించింది. అయితే ప్రభుత్వం దగ్గర నుంచి నెల నెల డబ్బులు తీసుకుని అందులో 10 నుంచి 20 శాతం కమీషన్‌ తీసుకొని పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించి మిగతా డబ్బులు ఆయా ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది.

కానీ 14 నెలలు కంప్యూటర్‌ ఆపరేటర్లకు సియెర్రా సాప్ట్‌ వేర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సొలూష్యన్స్‌ సంస్థ మాత్రం జీతాలు ఇవ్వకపోవడంతో ఆ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఆర్థికంగా లేకపోవడంతో చాలా సఫర్‌ అవుతున్నారు. నెల, రెండు, మూడు నెలలు అయినా ఏ ఔట్‌ సోర్సింగ్‌ అయినా ఆపితే పెద్దగా ప్రాబ్లం అవదు. ఎలాగోలా ఆ మూడు నెలలు వెళ్లదీసుకుం టారు. కానీ సదరు సంస్థ మాత్రం ఏకంగా ఏడాదికిపైగా ఒక్క పైసా చెల్లించక పోవడంతో ఈ ఉద్యోగులు నెలనెలా అప్పులు చేసుకొని ఇబ్బందుల్లో పడ్డారు. అట్టి అప్పులు తీర్చకపోవడంతో ఇంకా వారికి అప్పు పుట్టడం లేదని బోరుమంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ నుంచి నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

గవర్నమెంట్‌ రూల్స్‌ పాటించని సంస్థ
ఔట్‌ సోర్సింగ్‌ కింద తమను తీసుకున్నప్పుడు ఒక్కో ఉద్యోగికి ప్రతి నెలా రూ.18వేలు చెల్లిస్తామని చెప్పి అపాయింట్‌ చేసు కుంది. ప్రభుత్వం ఏజెన్సీకి ఇచ్చే మొత్తం చెల్లింపులో వాళ్లు కమీషన్‌ తీసుకొని మిగతా అమౌంట్‌ ఉద్యోగికి చెల్లిస్తుంది. అందులో ప్రతి ఎంప్లాయి పేరు మీద పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది. గవర్నమెంట్‌ నుంచి కాంట్రాక్ట్‌ తీసుకునే సమయంలోనే ఈ పద్దతిలో నడుచుకోవాల్సిందిగా కొన్ని గైడ్‌ లైన్స్‌ ఉంటాయి. కానీ ఆయా రూల్స్‌ బ్రేక్‌ చేస్తూ వెట్టిచాకిరి చేయిస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో పనిచేస్తున్న తాము సిటీకి దగ్గరలో ఉండడం వల్ల ఖర్చులు కూడా బాగా ఉన్నాయని అలాంటి తమకు జీతాలు రాక దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని ఆదాబ్‌ తో తమ ఘోడు వెళ్లబోసుకున్నారు.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించని ఏజెన్సీ
మేడ్చల్‌ జిల్లాలో మూడేండ్లకు పైగా పనిచేస్తున్న కంప్యూటర్లకు సియోర్రా సాప్ట్‌ వేర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌ పెద్ద కుచ్చటోపి పెట్టింది. ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో జాబ్‌ వీళ్ల వద్ద వాళ్ల కమీషన్‌ తోపాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ కింద డబ్బులు కట్‌ చేసిన నుంచి సదరు ఏజెన్సీ గత మూడేళ్లుగా పే చేయడం లేదు. 14 నెలలుగా జీతాలు రావడం లేదని బాధపడుతున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఈ షాకింగ్‌ న్యూస్‌ విని ఆశ్చర్య పోయారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు తమ వద్ద నెల నెల తీసుకున్న ఏజెన్సీ మా పేరున ఈపీఎఫ్‌ అకౌంట్లలో జమచేయాల్సింది పోయి సొంతంగా వాడుకుందని వాపోతున్నారు.
ప్రైవేటు ఏజెన్సీ ఇంత చేస్తున్నా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేలా కాంట్రాక్ట్‌ తీసుకున్న ఏజెన్సీ రూల్స్‌ ఫాలో కాకున్నా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇట్టి సంస్థ వెనుక ఎవరో బడా నేతల ఉన్నందునే ఎన్ని డ్రామాలు ఆడిన ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా వెంటనే ఆ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థపై చర్యలు తీసుకోని తమ బకాయి జీతాలను, అలాగే తమ వద్ద కట్‌ చేసిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులను కూడా తిరిగి చెల్లించేలా చూడాలని సదరు ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This