Thursday, November 21, 2024
spot_img

శ్ర‌మ దోపిడి చేస్తున్న సియోర్రా ఏజెన్సీ

Must Read
  • ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 14నెలలుగా అందనీ జీతం
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస
  • బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ
  • అటు స‌ర్కార్‌, ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు
  • కుటుంబం గడవక ఉద్యోగులు సతమతం
  • జీవో నెం.60 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం రూ.22,500
  • కానీ సియోర్రా ఏజెన్సీ చెల్లిస్తున్న వేతనం మాత్రం రూ.19,500
  • జీవో ప్రకారం వేతనం చెల్లించడం లేదంటున్న సియోర్రా
  • పీఎఫ్‌, ఈఎస్ఐ చెల్లించ‌కుండా ఉద్యోగుల‌కు మోసం
  • ప్రేక్ష‌క‌పాత్ర‌లో మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్

ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ తమ బాధ్యత నెరవేర్చుతున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు వేతనం రాక సతమతం అవుతున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని దాదాపు 35 మంది ఔట్ సోర్సింగ్ పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరేట్ సహా ఆయా మండల కార్యాలయాల్లో కొలువు చేస్తున్న వీరికి 14నెలలుగా జీతం అందడంలేదు. వచ్చేదే అరకొర వేతనాలు అంటే అవి కూడా టైంకు రాక బతుకేదెట్ల అంటూ బోరున విలపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలు కొని ఇటీవల ఆరు నెలల క్రితం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సైతం నెల నెల జీతాలు ఇవ్వకపోవడంతో సంవత్సరానికిపైగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు.

ప్రభుత్వ ఎంప్లాయిస్ తో సమానంగా పనిచేస్తున్న తమకు ఇచ్చే కొద్ది జీతమైన నెలనెల చెల్లించకపోవడంతో కుటుంబం గడవక ఇబ్బందులు తలెత్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఆఫీసర్లకన్న ఎక్కువ అనగా సుమారు రోజుకు 10, 12 గంటలు వర్క్ చేసిన పాపం అనిపియ్యట్లేదు. ఇదంతా హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ల దుస్థితి. కలెక్టరేట్, ఎమ్మార్వో ఆఫీసుల్లో పనిచేస్తున్న తమకు డబ్బులు రాక కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు. పై ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే విషయమై నెల నెల జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు అని ఉద్యోగులకు అడిగితే బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదని సమాధానం చెబుతోంది.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిమెంట్ కోసం ‘సియెర్రా సాప్ట్ వేర్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్’ అనే సంస్థ కాంట్రాక్ట్ తీసుకోని కొంతమంది ఉద్యోగులను పెట్టుకొని ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన వర్క్ చేపిస్తుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సదరు సంస్థ అగ్రిమెంట్ తీసుకొని వర్కర్లను (కంప్యూటర్ ఆపరేటర్లు) పెట్టుకొని కలెక్టరేట్ సహా ఆయా మండలాల్లో 35మందిని నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ 11, 2021న జీవో నెం.60 విడుదల చేసింది. దాని ప్రకారం కేటగిరి 1 -రూ.15,600, కేటగిరి 2-రూ.19,500, కేటగిరి 3 – రూ.22,500 చొప్పున ఆయా డిపార్ట్ మెంట్లకు చెందిన కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు డిక్లేర్డ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కంప్యూటర్ ఆపరేటర్ (డీఏఓ)గా విధులు నిర్వహిస్తున్న వారు కేటగిరి 3కి వస్తారు.

ఇందుకు సంబంధించి జీవో నెం.14ను ఫిబ్రవరి 19, 2016న అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. కేటగిరిలలో వచ్చే పోస్టుల వివరాలను వెల్లడిస్తూ వారి జీతభత్యాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. అందులో కేటగిరి 3 కింద కంప్యూటర్ ఆపరేటర్ (డీఏఓ) వస్తుందని వీరికి రూ.17,500లు జీతం చెల్లిస్తున్నట్లు వివరించింది. అనంతరం 2021లో వచ్చిన జీవో నెం.60లో ఆ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా వీళ్లకు సంబంధిత ఏజెన్సీ మాత్రం కేవలం రూ.19,500 ఇస్తుంది. అయితే దీనిపై ఏజెన్సీ యాజమాన్యాన్ని ఇదేమని వివరణ అడుగగా ప్రభుత్వం నుంచి తమకు వస్తున్న వేతనం రూ.19,500 మాత్రమేనని గవర్నమెంట్ పెంచి ఇవ్వడం లేదని బుకాయిస్తున్నారు. ఉద్యోగుల పేరిట 14 నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదని అడుగగా ఈఎస్ఐ నెలనెల పేమెంట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పీఎఫ్ డబ్బులు మాత్రం జమ చేయలేదని గవర్నమెంట్ నిధులు ఇవ్వక పోవడంతో చెల్లించలేదని వివరణ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అటు పీఎఫ్ అమౌంట్ కూడా జమ చేయకపోవడం గమనార్హం.

కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమ ఘోడు విని 14 నెలలుగా తమ వేతనాలు ఇయ్యని సియెర్రా సాప్ట్ వేర్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ పై అధికారులు చర్యలు తీసుకొని ఆ ఏజెన్సీని రద్దు చేయాలని, అదే విధంగా కార్మిక శాఖ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌) స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉద్యోగ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించి మాకు తిరిగి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కంప్యూటర్ ఆపరేటర్లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

సియెర్రా సాప్ట్ వేర్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ యాజ‌మాన్యం వివిధ జిల్లాలోని సంస్థ‌లో ప‌నిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగ‌స్తుల‌ను మోసం చేస్తున్న విష‌యాల‌పై పూర్తి ఆదారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం…

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS