-18వ లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లా
- తొలిప్రసంగంలోనే ఓంబిర్లా నోట ఎమర్జెన్సీ మాట
- ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుంది
- ఎమర్జెన్సీని లోక్ సభ ఖండిస్తుంది
- స్పీకర్ చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసిన విపక్ష నేతలు
అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన “ఎమర్జెన్సీ” చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుందని అన్నారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.18వ లోక్ సభ స్పీకర్ గా ఓంబిర్లా బుధవారం ఎన్నికయ్యారు.స్పీకర్ గా ఎన్నికైన తొలి ప్రసంగంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.1975లో ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీ ని లోక్ సభ ఖండిస్తుందని తెలిపారు.ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి సభ అభినందనలు తెలియజేస్తుందని అన్నారు.దేశ చరిత్రలోనే 1975 జూన్ 25 తేదీ బ్లాక్ డే గా నిలిచిపోతుందని వెల్లడించారు.ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కరని,భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని,ఈ విషయం యావత్తు ప్రపంచానికి తెలుసనిఅన్నారు.ఎమర్జెన్సీ లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నూతనంగా ఎన్నికైన స్పీకర్ తన తొలి ప్రసంగంలోనే ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకొని రావడంతో విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.ఓం బిర్లాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.