ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.150 మంది ఉద్యోగులను తాత్కాలికంగా సెలవుల పై పంపిస్తునట్లు వెల్లడించారు.కానీ వారిని సంస్థ ఉద్యోగులుగానే పరగణిస్తామని స్పస్టం చేశారు.విమానాల సంఖ్య తగ్గిపోవడం,ఇతర కారణాల వల్ల తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. స్పైస్ జెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఎప్పుడు ఎవరిని పంపించేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.