హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్రమంతి కిషన్రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ – వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి బుధవారం, శుక్రవారం వాస్కోడగామా – సికింద్రాబాద్ ( 17040 ) రైలు ప్రతి గురువారం , శనివారం బయల్దేరుతాయి.
ఈ సంధర్బంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ,సికింద్రాబాద్ నుండి గోవాకు వెళ్తున్న ఈ బై వీక్లీ రైలును ప్రారంభించుకుంటున్న సంధర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లరి, కొప్పల్, గడగ్, హుబ్బళ్లీ, ధార్వాడ్, లొండా, క్యాసిల్ రాక్, కులేం, మడగావ్ మీదుగా వాస్కోడగామాకు చేరుకుంటుందని తెలిపారు.రైలు ప్రారంభం సంధర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ,రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రత్యేక ధన్యవాదలని అన్నారు.