యశోద హాస్పిటల్స్ సోమాజీగూడా యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా “రేజం వాటర్ వేవర్ థెరఫీ”ని విజయవంతంగా నిర్వహించింది.గత కొన్ని వారాలుగా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి,అసౌకర్యం మరియు ఇబ్బందులను భరిస్తున్న కామారెడ్డికి చెందినా 68ఏళ్ల రైతు,యస్. అంజా గౌడ్ కి ఈ అత్యాధునిక వైద్య ప్రక్రియను మే 28న విజయవంతంగా నిర్వహించబడింది.ఈ సందర్బంగా సోమాజీగూడా యశోద హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ మరియు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్,డా.వి సూర్యప్రకాష్ మాట్లాడుతూ శాస్త్రచికిత్సని ఇష్టపడని వారికీ ఈ ప్రక్రియ ఉత్తమ ప్రత్యామ్నాయం అని అన్నారు.ఈ ప్రక్రియను అన్ని రిస్క్ కేటగిరీల రోగులకు నిర్వహించవచ్చని,శాస్త్ర చికిత్స తర్వాత ఎలాంటి లైంగిక సంబంధిత సమస్యలు ఉండవు అని పేర్కొన్నారు.మూత్రనాళంపై ఒత్తిడిని కలిగించే అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని సమర్థవంతంగా తొలగించడానికి “రెజమ్ వాటర్ వేపర్ థెరపీ” ఒక ఉతమమైన చికిత్స అని అన్నారు.తేలికపాటి మత్తులో “రెజమ్ వాటర్ వేపర్ థెరపీ” చికిత్స నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.నీటి ఆవిరిని అందించే ఎండోస్కోప్ ను మూత్రనాళంలోకి పంపించి, ప్రోస్టేట్‌లోకి ఎండోస్కోప్ ద్వారా సూది చొప్పించబడుతుంది, దానిద్వారా అధిక ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరిని 9 సెకన్ల పాటు ప్రోస్టేట్‌లోకి పంపిణీ చేయబడుతుంది.తరువాత ప్రోస్టేట్ పరిమాణాన్ని బట్టి మూడు నుండి నాలుగు సైట్లలో చికిత్స పూర్తవుతుందని అన్నారు.సరఫరా చేయబడిన నీటి ఆవిరి కణజాల నెక్రోసిస్‌ను ప్రేరేపించి,ఫైబ్రోసిస్ ద్వారా నయం చేస్తుందని,దీనివల్ల ప్రోస్టాటిక్ లోబ్స్ తగ్గిపోతుందని తెలిపారు.తద్వారా మూత్రనాళనికి ఒత్తిడి తగ్గి పేషెంట్ వెంటనే ఉపశమనం పొందుతాడని,ఈ ప్రక్రియ అనుకూలమైన డే-కేర్ ట్రీట్‌మెంట్‌గా రూపొందించబడిందని,పేషెంట్ చికిత్స తర్వాత అదే రోజు ఇంటికి వెళ్ళవచ్చని డాక్టర్. వి. సూర్య ప్రకాష్ తెలియజేశారు.