ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర పరిశ్రమల్లో లైంగిక దురాగాతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు, హిందీలో మీటూ ఉద్యమం.. ఇప్పుడు తాజాగా కేరళ (మలయాళం) మూవీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపుల ఘటన.దేశంలోనే తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ మూవీ అసోసియేషన్ పై విమర్శలు ఏకంగా నటీనటుల సంఘం (అమ్మ) కార్యవర్గ సైతం పూర్తిగా రాజీనామా చేసేదాకా వెళ్ళిపోయింది. కేరళ మూవీ ఇండస్ట్రీ ఎంత ఘోరంగా తయారైందో తెలుస్తోంది.
2017లో నటి భావన మీనన్ పై కొచ్చిన్ లో కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.దీని వెనుక మలయాళ నటుడు దిలీప్ ఉన్నాడని తెలియడంతో ప్రభుత్వం జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో మలయాళ సినీ పరిశ్రమకు మాయని మచ్చగా ఏర్పాటయింది. తర్వాత ఇండస్ట్రీలో సమస్యలు సర్దుబాటు అయ్యాయి అంటే అది లేదు మరిన్ని వేదింపులు, ఆరోపణలు వచ్చి యావత్తు కేరళ సినీ ఇండస్ట్రీని ఒక్కరి బిక్కిరి చేసే స్థాయికి తీసుకెళ్లాయి.
మలయాళం మూవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖిపై రేవంతి సంపత్ అనే నటి అత్యాచారం చేశారని చెప్పింది. సినిమాపై ఆసక్తి ఉందని తెలిసి హోటల్ కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారని 2019లోనే ఆమె ఆరోపించింది. ఇప్పుడు మళ్లీ రెండోసారి సిద్ధిఖిపై ఫిర్యాదు కు పాటుపడడంతో సిద్ధిఖి రాజీనామా చేశారు. మరో మలియాల నటుడు ముఖేష్ ప్రస్తుతం సిపిఎం ఎమ్మెల్యే, క్యాస్టింగ్ డైరెక్టర్ సైతం తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపణలు బయటికి వచ్చాయి. ఇంతటితో ఆగక ప్రభుత్వ చలనచిత్ర అకాడమీ చైర్మన్ రంజిత్ పై ఆరోపణలు రావడంతో అయినా రాజీనామా చేశారు. ఇలా మొత్తం అసోసియేషన్ సభ్యులతో కలిపి చివరకు మోహన్ లాల్ కూడా ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు.
మలయాళం మూవీ ఇండస్ట్రీలో నటులపై ఆరోపణలు రావడంతో మలయాళ మూవీ పరిశ్రమ పరువు, ప్రతిష్టలు దిగజారి నట్లు అయింది. నటి సినిమా తీయాలి అంటే కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్ ఉండాల్సిందే. క్యారెక్టర్లు తెచ్చిన మేనేజర్లకు రాజీ పడాలి. సినిమా చేయాలంటే నటి, నటులపై తీవ్ర ఒత్తిడిలో తీసుకొస్తున్నారు. అనుకూలంగా లేకపోతే అవకాశాలు ఇవ్వకుండా… నాశనం చేసే ప్రయత్నాలు చేయడం సభ్య సమాజం సిగ్గుపడే విషయం. పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామా చేయడంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై అనుమానాలు అందరిలో మరింత బలపడ్డాయి.
మలయాళం సినీ ఇండస్ట్రీలో మహిళలకు సరైన భద్రత లేదని శ్రమ దోపిడీ ఉందని అర్థం అయింది. దీనికి పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. నకి భావన లైంగిక దాడి తరువాత చాలామంది ముందుకొచ్చి తమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పడంతో మిగతా పరిశ్రమమున నుంచి అదే స్పందన మొదలయింది మహిళా నటుల వేధింపులపై విచారణకు ప్రబ్బినల్ ఏర్పాటు చేయాలని నివేదికలో హేమ కమిషన్ సిఫార్సు చేసింది అయితే కేరళ సర్కార్ ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. హేమ కమిషన్ ఇచ్చిన నివేదికలో మిస్ అయిన పేజీలు బయటకు తీయాలి లేకుంటే అందులో ప్రముఖుల పేర్లు ఉన్నాయని ఆరోపణలు కూడా నిజమవుతుంది….
- పట్ట. హరి ప్రసాద్
- 8790843009