Saturday, April 19, 2025
spot_img

ప్రభుత్వ భూమి కబ్జా దారులపై కఠిన చర్యలు తప్పవు

Must Read
  • కాప్రా మండల్‌ మారుతీ కాలనీ స‌ర్వే నెంబర్‌ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం
  • ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్‌ సుచరిత
  • కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా
  • ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్‌

కాప్రా సర్కిల్‌ పరిధి కుషాయిగూడ మారుతీ కాలనీలోని సర్వే నెంబర్‌ 199/28 లో గల 15 గుంటల భూమి అక్రమ కబ్జా స్థలం అని కాప్రా తహసీ ల్దార్‌ సుచరిత కూల్చివేత చేయడం జరిగింది. కాప్రా తహసీల్దార్‌ చెప్పిన వివరాల ప్రకారం గత కొన్ని యేండ్ల నుండి ప్రభుత్వ భూ మిలో అక్రమ షెడ్లు ఏర్పాటు చేసి మంత్రి లక్ష్మణ్‌ ప్రభుత్వ భూమి కబ్జా చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇట్టి భూమిపై వుంటూ ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన పత్రాలు లేక భూమిని తత్కాలి క షెడ్లు ఏర్పాటు చేసి నర్సింహులు అనే వ్యక్తికి కిరాయికి ఇచ్చి డబ్బులు రూపంలో లబ్ది పొందుతున్నారని కాప్రా తహసీల్దార్‌ తెలి పారు. ఇట్టి విషయమై సదరు వ్యక్తులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, ఏర్పాటు చేసిన షెడ్లు తీసువేయుటకు కచ్చితమైన కాల పరిమితి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అట్టి భూమిని స్వాధీనం చేసుకోమని కోర్ట్‌ ఆర్డర్‌ గతంలో వున్నా తహసీల్దార్‌ సమయంలో వచ్చిందని, పాత దస్తావేజులు అన్ని ప్రభుత్వ భూ ముల వివరాలు తీసి ప్రభుత్వ భూమి తెలిపే సూచిక బోర్డు ఏర్పా టు చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి ప్రభుత్వ భూమి పైకి ఎవరైనా వచ్చి అతిక్రామిస్తే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ప్రభుత్వ భూమి ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. కాప్రా మండల్‌ ప్రాంతంలో వున్నా ప్రభుత్వ భూములు అన్ని వెలికి తీస్తానని అని తెలిపారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS