పొందిన మనిషిని అలాగే గుప్పిట్లో పెట్టుకోడానికి జీవితాంతం పోరాటమట.
నీతి పోరాటాలకు తీరిక లేదు పెరిగిన ధరలకు పోరు లేదు ఓటు వస్తే పోటు తప్పదిక..భారంగా బ్రతుకీడుస్తూ,బాధ్యతల్ని మోస్తూ, బందీఖానాలో వేసినట్టుగా జీవించే ఓ మనిషీ…ఒక్కసారి ఆ వలయాన్ని దాటుకుని బయటికిరా…స్వేచ్చా ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయ్, కుటుంబ బంధాల్లోనే మగ్గిపోతే ఎలా… ప్రశ్నించే గొంతుకలా మారు, ప్రజల్లో ఒకడిగా చేరు…పరిమితులకి లోబడితే ఒక్కడిగా మిగులుతావ్, ప్రజల కోసం నిలబడితే కోటికొక్కడివవుతావ్.
- తాండూర్ వెంకటేష్