- దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..!
- సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..!
- ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..!
- చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు..
తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ..ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే..ఈ శాఖ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఈ శాఖ నుండి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి చిక్కిన అధికారులు సైతం ఎక్కువే…అవినీతి ఎక్కువైనా ఇది జనానికి,ప్రభుత్వానికి అలవాటైన ఒక వ్యసనం.. సామాన్యుల నుండి సంపన్న స్థాయి వ్యక్తుల వరకు ఈ శాఖ నుండి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది.మ్యారేజ్ సర్టిఫికెట్ నుండి భూమి రిజిస్ట్రేషన్లు ఇతరత్రా చిన్నచిన్న రిజిస్ట్రేషన్‌ల వరకు ప్రతిదీ ఈ శాఖకు సంబంధమే..ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం అవుతుంది ఎందుకు లెండి..!
అవినీతి సొమ్ముకు రుచి మరిగి అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న సబ్ రిజిస్ట్రార్ జ్యోతి చరిత్ర ఇది..సబ్ రిజిస్ట్రార్ తో పాటు సహాయక ఉద్యోగు లకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి.. చిన్న చిన్న కేటగిరిలో రిజిస్ట్రేషన్ల కోసం అర్జీ పెట్టుకుంటే పత్రాలను అక్కడే ఉంచుకొని వెరిఫికేషన్ చేయాలంటూ రోజులు గడుపుతున్నారు అని రిజిస్ట్రేషన్ కు వచ్చిన జనాలు బెంబేలెత్తిపోతున్నారు.. ఇక్కడ ఆస్థులు,స్థలాలు ఉండి బయట దేశం వెళ్లే ఎన్నారైలు ముందస్తుగా వీసా ప్రాసెస్ చేసుకొని, అన్ని ప్లాన్ చేసుకొని,ఫ్లైట్ టికెట్లు వేసుకొని బయట దేశాలకు వెళ్లే పరిస్థితిలో జిపిఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇతరులకు ఇచ్చే ప్రయత్నంలో రోజులు గడపడం,వీసాలు,ఫ్లైట్ టికెట్లు క్యాన్సల్ కావడం.. ఇలా ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ ని సదరు భూ యజమాని ప్రశ్నిస్తే వెరిఫికేషన్ చేయాలంటూ,దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు మూడు రోజులు ఆగవలసిందే అని మొండికేయడం,అదనంగా డబ్బులు వసూలు చేసి పనిచేయడం పరిపాటిగా మారింది.
ముఖ్యంగా విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే..ఎల్.బీ. నగర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి మేడంతో పాటు, అర్హులైన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆంగ్లం రాక ప్రైవేటు వారిపై ఆధారపడడం,దస్తావేజులు పరిశీలించలేని దుస్థితిలో ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు..దీనిపై డిస్టిక్ రిజిస్ట్రార్ సంతోష్ వెంటనే స్పందించి, ఆంగ్లం వచ్చిన అధికారులను నియమించి, సదరు సబ్ రిజిస్ట్రార్‌కి సహాయం చేయాలని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజానీకం కోరుతున్నారు.
ప్రైవేటు ఉద్యోగుల చేతివాటం :
ఉన్నత స్థాయి అధికారి బలహీనంగా ఉండడంతో ప్రైవేట్ ఉద్యోగ స్తులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ.. ప్రభుత్వ లాగిన్ ఐడీలతో దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చేరవలసిన పన్ను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు.. స్థానికంగా క్షేత్ర స్థాయిలో రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు సదరు భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల నకలు కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని, ఫీజు చెల్లించి దస్తావేజులు పొందాలి.. అలా కాకుండా ప్రైవేటు ఉద్యోగులకు కొంత ముడుపు చెల్లిస్తే చాలు వారు ఆనకలు పత్రాలను డౌన్లోడ్ చేసి ప్రభుత్వ ఆధీనంలో గుప్త ంగా ఉండే డాటాను, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం దారుణమైన పరిస్థితి తద్వారా ఎన్నోఅక్రమాలు తలెత్తే పరిస్థితి నెలకొంటుంది.
ముడుపులను రెట్టింపు చేసి ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..!
సరే ఎంత అవినీతి జరిగినా,అక్రమాలు జరిగినా ప్రభుత్వానికి పన్ను అందుతేనే ప్రభుత్వం నడిచే పరిస్థితి.నేడు ఎల్.బీ.నగర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే పనులే చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.. గత సబ్ రిజిస్ట్రార్‌తో పోలిస్తే నేడు జ్యోతి వచ్చిన తర్వాత పన్నుల రాబడి తగ్గింది..సరే మేడం అవినీతిపరురాలు కాదు అనుకుంటే తప్పులో కాలేసి నట్టే.. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం పరిధిలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆస్తి దారుడు చిన్నచిన్న అక్రమా లకు పాల్పడితే, సదరు సబ్ రిజిస్ట్రార్ పన్నులు విధించి రిజిస్ట్రే షన్లు చేయడం పరిపాటి.పై అంతస్తులకు, అనుమతులు లేని నిర్మాణాలకు ఎస్.ఎఫ్.టి.కి రూ.1100లు, సీలింగ్‌ల్యాండ్ ఇతర స్థలాలలో గజానికి రూ.200ల పన్ను వేసి రిజిస్ట్రేషన్లు చేయాలి..కానీ నేడు ఎల్.బీ.నగర్‌లో ఎవరైనా నిర్మాణదారుడు రెండు ఫ్లోర్లు పర్మిషన్ తీసుకొని ఒక చిన్న పెంట్ హౌస్ నిర్మాణం చేపడితే 50 వేల నుండి లక్ష రూపాయలు..అపార్ట్మెంట్లు అయితే వేరే రేటు.. జిహెచ్‌ఎంసి, మున్సిపల్ అనుమతులు లేకపోతే ఐదు లక్షల పైచిలుకు అనఫిషియల్ జ్యోతి టాక్స్ చెల్లించవలసిందే..లేకుంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రోజుల తరబడి మూలగవలసిందే..ఈ విధంగా స్థానికంగా ఉండే సామాన్య జనానికి కంట్లో నలుసు లాగా తయారై,అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ..ఇటు ప్రజల ను ఇబ్బందుల గురిచేస్తున్న అధికారులను ఉపేక్షిస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ వాస్తవాన్ని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి లో పర్యవేక్షణ జరిపి..సరైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజానీకం ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు..