తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి సల్పిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. మంగళవారం పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి జయంతోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా సంపాదకుడిగా పరిశోధకుడిగా పండితుడిగా రచయితగా క్రియాశీల ఉద్యమకారుడిగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి ఎనలేనిదని తెలిపారు. తెలంగాణలో 348 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంధాన్ని కవుల జీవిత విశేషాలతో ప్రచురించి తెలంగాణ ఖ్యాతిని చాటిన మహనీయుడు సురవరం అని, విమర్శకులకు సమాధానం ఇచ్చిన గొప్ప కవి అని తెలిపారు. గోల్కొండ పత్రిక స్థాపించి సంపాదకుడిగా పత్రిక రచయితగా ప్రసిద్ధి చెందాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలను చైతన్యపరచిన గొప్ప కవి సురవరం అని, సురవరం రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని, వీరి రచనల ద్వారా ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది వి.మనోహర్ రెడ్డి, ఎస్. మల్లారెడ్, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్ రెడ్డి, కోశాధికారి మల్లు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు జి వెంకట్రాంరెడ్డి, ప్రచార కార్యదర్శి ఎన్ సురేందర్ రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి, సభ్యులు పరమేశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారు పోతుల రాఘవరెడ్డి, పొద్దుటూరు ఎల్లారెడ్డి, బెక్కరి అనిత, మహిళా విభాగం స్వరూప, వనజ, వరలక్ష్మి, శోభ, సునీత, కవిత, వినోద, కౌన్సిలర్లు కట్టా రవికిషన్ రెడ్డి, రావుల అనంతరెడ్డి, మాజీ కౌన్సిలర్ విఠ్ఠల్ రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, పోతుల గిరిధర్ రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.