Sunday, January 19, 2025
spot_img

అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో నిందితుడి గుర్తింపు

Must Read

హైదరాబాద్‌లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని మనీష్‌గా గుర్తించారు. ఇతడు బీహార్‌ రాష్ట్రానికి చెందిన వాడుగా పోలీసులు తెలిపారు. మనీష్‌తో బీహార్‌ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితుల చోరీలు మొదలు పెట్టారు. ఛత్తీస్‌గడ్‌లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి రూ. 70 లక్షల రూపాయలు మనీష్‌ అండ్‌ కో కాజేశారు. అనంతరం గురువారం (జనవరి 16) బీదర్‌లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసి రూ.93 లక్షలు మనీష్‌ ఎత్తుకెళ్లాడు. బీదర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మనీష్‌.. అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపాడు. ఇప్పటికే మనీశ్‌పై బీహార్‌ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. గతంలోనూ మనీష్‌పై మర్డర్‌, దోపిడి కేసులు ఉన్నాయి. గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్‌ బార్డర్‌ దాటి నేపాల్‌ పారిపోయాడు. కేసుల తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలకు పాల్పడుతున్నాడు మనీష్‌. మనీశ్‌ను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ, బీహార్‌, కర్ణాటక, చత్తీస్‌గడ్‌లో మనీష్‌ కోసం పోలీసులు(Police) గాలిస్తున్నారు. హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి ఆటోలో సికింద్రాబాద్‌ వెళ్లిన నిందితులు అక్కడ బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుశ్య ప్రదేశంలో బట్టలు, బ్యాగులు మార్చుకున్నారు. తిరుమలగిరిలో బ్యాగులను నిందితులు వదిలేశారు. ట్రాలీ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాలీబ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దాదాపు పది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖచ్చితంగా కేసును చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Latest News

ధనుష్ దర్శకత్వంలో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

సినీ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా ధ‌నుష్‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS