Thursday, February 6, 2025
spot_img

చర్లపల్లి పారిశ్రామిక వాడ అగ్ని ప్రమాదంపై అనుమానాలు

Must Read
  • సర్వోదయ సాల్వంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్‌ కోసమేనా?
  • అగ్ని ప్రమాదంపై చట్టపరమైన చర్యలు తప్పవు కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి యాదవ్‌
  • ఆదివారం కాకుండ.. పని రోజు మంగళవారం సెలవు ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి
  • ప‌రిశ్ర‌మ అగ్ని ప్రమాదంకు గురైతే యాజమాన్యం పట్టించుకోక పోవడానికి కారణాలేంటి ?

చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సర్వోదయ సాల్వంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం విషయం పై స్థానిక కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ.. కంపెనీ యాజమాన్యం ఫోన్‌ కాంటాక్ట్‌లోకి రాలేదని, ఘటన పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మీడియా ప్రతినిధులు ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై వివ‌రాలు అడుగ‌గా.. ఈ ఘటన పై పలు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నారు తెలిపారు. చట్ట పరమైన చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని, ఈ కంపెనీ వేరే రాష్ట్రనికి తరలించారని దాని పై అందరకి పలు అనుమానాలు ఉన్నాయనన్నారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు ఫోన్‌ కాంటాక్ట్‌లోకి రాలేదని, యాజ‌మాని అందుబాటులోకి వస్తే సంఘటన ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉందని అన్నారు. ఈ కంపెనీలో చర్లపల్లి ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని వ్యర్థ పదార్ధాలు తీసుకొచ్చి శుద్ధి చేసి, నాచారం ఎస్‌టిపికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రక్కన వున్నా రబ్బర్‌ కంపెనీ అగ్ని ప్రమాదంకు గురి కావడం జరిగిందని ఆ కంపెనీ యాజమాన్యం బోరున విలపిస్తున్నారు.

ఆదాబ్‌ హైదరాబాద్‌ రిపోర్టర్‌ ఈ విషయం పై ప్రక్కన వున్నా ప‌లు కంపెనీలో విచారించగ ప్రతి రోజు ఇరువై మంది వరకు పని చేస్తారని, ఎందుకో ఆదివారం కాకుండా మంగ‌ళ‌వారం సెలవు ఇవ్వడం జరిగిందని అన్నారు. కంపెనీకి సెక్యూరిటీ గార్డ్‌ కూడ పెట్టలేదని అందులో పని చేసే వారే చూసుకునే వారని తెలిపారు. క్ష‌ణ్ణంగా ప‌రిశీలిస్తే.. ప‌రిశ్ర‌మ ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఈ ప్ర‌మాదం జ‌రిగంద‌న్న అనుమానులు ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఫైర్‌ సేఫ్టీ వారిని విచారించగ ఈ కంపెనీ వారికి సేఫ్టీ పై ఎన్నిసార్లు అవగాహనా ఇచ్చిన ఫలితం శూన్యం అన్నారు. కంపెనీ యాజమాన్యం తమ సొంత లాభం కొరకు కుట్ర పన్ని ఇతరులకు నష్టం జరిగేలా చూస్తున్నారని, ఈ సంఘటన చుస్తే అర్ధం అవుతుందని, ఆదివారం కాకుండ మంగళవారం సెలవు ఇవ్వడం పై పలు అనుమానాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇండస్ట్రియల్‌ డిపార్ట్మెంట్‌ చర్యలు చేపడితే నిజాలు తెలుస్తాయని ప్రక్కన వున్నా కంపెనీ యాజమాన్యం కోరుకుంటున్నారు.

Latest News

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS