Thursday, January 30, 2025
spot_img

ప్రభుత్వ భూమిలోని వాగును కబ్జా చేసిన సువెన్ ఫార్మ

Must Read
  • 33 ఫీట్ల వాగు భూమి కబ్జా ˜ అధికారులకు ఫిర్యాదు చేసిన,
  • పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదుదారుడు ఆవేదన
  • హైడ్రా తరహాలో సూర్యాపేటలో కూడా అధికారులు పనిచేయాలి
  • ప్రజావాణిలో సువెన్‌ ఫార్మ పై ఫిర్యాదు

సూర్యాపేట పట్టణం శాంతినగర్‌లో ఉన్న సువెన్‌ ఫార్మా, గత కొన్ని సంవత్స రాలుగా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ వస్తుంది. ఈ కంపెనీ వల్ల ఐదు గ్రామాలకు పైగా ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ భూమిలోని వాగును కబ్జా చేయడంతో వస్రాంతండకు చెందిన ధారావత్‌ శంకర్‌ నాయక్‌ సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కేసారం శివారు వస్రాంతండ, దురాజ్‌ పల్లి దగ్గర (సర్వే నెం 103) పరిధిలో గల ప్రభుత్వ వాగు 33 ఫీట్ల, రైతుల స్థిరాస్థి భూమిలోని వాగును కూడా సువెన్‌ ఫార్మా కంపెనీ వారు అన్యాక్రాంతం చేసుకొని స్వాధీనపరచుకున్నారు. గతంలో ఎన్నో పిర్యాదులు ఇచ్చినప్పటికి అట్టి ప్రభుత్వ వాగును స్వాధీనం చేసుకోవడంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని ఫిర్యాదుల పేర్కొన్నారు. హైడ్రా స్పూర్తితో తిరిగి ఫిర్యాదు చేయడం జరుగుతుందని, క్రమ క్రమంగా అట్టి ప్రభుత్వ వాగు పూర్తిగా సువెన్‌ ఫార్మా కంపెనీ వారి ఆధీనంలో ఆక్రమణకు గురైనది. ఆలా అన్యాక్రాంతం అయిన వాగును గ్రామస్తులు ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన గత పాలకులు కానీ, అధికారులు కానీ పట్టించు కోలేదన్నారు. ఇప్పటికైనా హైడ్రా ఇచ్చిన స్పూర్తితో అధికారులు జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, సువెన్‌ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఆక్రమించుకున్న వాగుపై విచారణ చేపట్టి, సువెన్‌ ఫార్మా వారిపై తక్షణమే చర్యలు తీసుకొని, సమగ్ర విచారణ చేపట్టి 33 ఫీట్ల వాగును గుర్తించి ఫార్మా కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొని తగు న్యాయం చేస్తారని కోరారు. గతంలో ఈ వాగు ఆక్రమణ విషయమై అధికారులకు ఇచ్చిన దరఖాస్తు జీరాక్స్‌ వ్రతులను జిల్లా కలెక్టర్‌ కు అందించినట్లు తెలిపారు.

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS