కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశ, దిశా,నిర్దేశాలు, విధి విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కుల గురించి తెలియజేసే లిఖిత మైన మహత్తర గ్రంథమే భారత రాజ్యాంగం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలో, ప్రజలకు పాలకులు ఏ విధమైన పరిపాలన చేయాలో తెలియజేసే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల సమన్వయం ఎలా ఉండాలో తెలిపేదే...