Sunday, January 19, 2025
spot_img

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేష‌న్

Must Read
  • కాకరేపుతున్న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు..
  • అభ్యర్థి ఎంపికపై గులాబీ,హస్తం పార్టీల కన్ఫ్యూజన్‌..
  • ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి హీట్ పెంచేసిన బీజేపీ
  • హస్తం పార్టీ అభ్యర్థి ఎవ్వరనేదీ ఢిల్లీ నేతలే చెప్పాలట ..
  • బీఆర్ఎస్ పోటీ చేయడం డౌటే అంటున్నారు పెద్దలు
  • అంతు చిక్కని జవాబులా బీఆర్ఎస్ పార్టీ పెద్దల వ్యూహం
  • కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో బీఆర్ఎస్ నేతలకు చిరాకు

ఎంకి పెళ్లి ఇంకొకరి చావుకొచ్చిందట అనే సామెత లా ఉందట గులాబీ నేతల పరిస్థితి..ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి..పోటీ చేస్తే ఓడిపోతే తట్టుకోలేని దుస్థితి గులాబీ పార్టీకి ఏర్పడిందట ..పైకి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల ఎందుకొచ్చిన లొల్లి సైలెంట్ గా ఉండటమే బెటర్ అనుకుంటున్నారట..పార్టీ పెద్దలు..ఒకరిద్దరి సీటుకావాలని పట్టుబడుతున్నప్పటికీ పోటీ ఫై ఎటు తేల్చుకోలేని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడిందట ..నిజానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ రాజకీయాలను హీటెక్కించేస్తున్నాయి..ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించి ఊపు క్రియేట్ చేయగా .. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కన్ఫూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది..ఇక గులాబీ పార్టీ విషయానికొస్తే టీచర్ ఎమ్మెల్సీపై ఉలుకు పలుకు లేదు . ఎమ్మెల్సీ సీటుపై ఎవరేమి ఆడోగొద్దని పార్టీ పెద్దలు నాయకులకు ముందే చెప్పేశారట..దాంతో గులాబీ తమ్ముళ్లు మౌనంగా ఉండి పోయారట..

ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపోమాపో మోగనున్న నగారా ..
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు, కరీంనగర్-ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్‌ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపోమాపో నగారా మోగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం 191 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 24వేల 905 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించగా..అధికార కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతు తెలపాలి..పోటీ చేయాలా.? వద్దా అనే డైలమాలో ఉందట. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకుండానే పూర్తిగా సైలెంట్‌గా ఉందని తెలుస్తోంది..విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత.. వావిలాల నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందన్న ఆశతో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నైనా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని తెలుస్తోంది..

అంతు చిక్కని జవాబులా బీఆర్ఎస్ పార్టీ పెద్దల వ్యూహం:-
వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ వ్యూహమేంటో అంతు చిక్కడం లేదు . కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యహరిస్తోంది. అయితే వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ఉపాధ్యాయ సంఘాల యాక్టివిటీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ.. కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉండే సామాజిక సంస్థలు, కుల సంఘాలు, విద్యారంగంలోని వివిధ అసోషియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయని తెలుస్తోంది..ఒక బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాలని చూస్తున్నాయట ..అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది.? బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా.? లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది. నోటిపికేషన్‌ వస్తే పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం కానుంది.

Latest News

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు..!

అర్ధ‌రాత్రి నిందితుడు విజ‌య్ దాస్‌ను అరెస్ట్ సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా గుర్తించిన‌ట్లు వెల్ల‌డి ముంబ‌యి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌ సమావేశం వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్న ముంబ‌యి పోలీసులు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS