- సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఏనాడు కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 30వేల ఉద్యోగులు ఇచ్చామని గుర్తుచేశారు.
తెలంగాణను రెండుసార్లు కొరివి దయ్యం పాలించిందని వ్యాఖ్యనించారు. కేసీఆర్ ఏనాడైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ల బదిలీలు ప్రమోషన్లు చేపట్టామని వెల్లడించారు.