స్టడీ అవర్లు గాలికి వదిలేసిన వైనం
చిగురు మామిడి మండలం చిన్నముల్కనూర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల చదువులపట్ల అధ్యాపకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పదవ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించటానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తుంది. కానీ మోడల్ స్కూల్ అధ్యాపక బృందం మాత్రం ఈ సమయ పాలనతో మాకేం సంబంధం లేదన్నట్టు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు రావాల్సిన రోజు ఇంకొక సబ్జెక్టు సర్ రావడం. మళ్ళీ ఉదయం ఎనమిది గంటలకు పదవ తరగతి స్టడీ హవర్ మొదలైన కూడా వల్ల ఇష్టానుసారంగా పట్టించుకునే వారు లేరు ప్రశ్నించే వారు లేరు అన్నట్టు 8:40 నిమిషాల వరకు కూడా స్కూల్ కీ రావడం లేదు. పదవ తరగతి రెండు సెక్షన్ లు ఉంటే ఒక్కరే ఉపాధ్యాయుడు వచ్చి రెండు సెక్సేన్ లు చూసుకోడం జరుగుతుంది ఇలా చేయడం వలన విద్యార్థులు నష్టపో తారని కనీసం ఆలోచన లేకుండా తమ ఇష్టారీతిన వ్యవహరి స్తున్నారు. సోమవారం అనగా 3-3-2025 నాడు మ్యాథ్స్ స్టడీ హావర్ ఉన్నప్పటికీ సంబంధిత ఉపాధ్యాయులు ఉదయం 8 గంటలకి రావాలి కానీ 8:30 దాకా వాళ్ళ జడానే లేదు కానీ రిజిస్టర్‌లో 8 గంటలకి వచ్చినట్టే సంతకాలు మాత్రం చేస్తున్నారు. మళ్ళీ మంగళవారం నాడు ఇంగ్లీష్ స్టడీ అవర్ ఉంది రెండు సెక్షన్‌లోకి ఇద్దరు అధ్యాపకులు రావాలి కానీ ఒక్కరే ఉపాధ్యాయుడు 8 గంటలకి స్కూల్ లో ఉన్నాడు ఇంకొక ఉపాధ్యాయుడు ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా పిల్లలు ఎక్కువ రావట్లేదు అందుకే ఒక్కన్నె వచ్చి రెండు సెక్షన్ లు చూసుకుంటున్నాను అని మళ్ళీ ఇంకొక ఉపాధ్యాయుడు స్టేట్ రిసోర్స్ పర్సన్ కావున స్టడీ హవర్ రాలేకపోయి వుండొచ్చు అని సమాధానం చెప్పరు. ఒక వేళ ఆ ఉపాధ్యాయుడు రాకుంటే సెలవు లో ఉంటే అతనికి బదులుగా వేరొక ఉపాధ్యాయున్ని ప్రిన్సిపాల్ ఎందుకు కేటాయించలేదు. ఇది ఇలా ఉంటే స్టడీ హవర్ కి రాని ఉపాధ్యాయుడు సెలవులో లేడు మెల్లిగా 9 గంటలకి వచ్చాడు . ఇక విద్యార్థులు కూడా 8 గంటలకి రావాల్సిన వారు 8:30 వరకు వస్తూనే వున్నారు. ఇలా విద్యార్థుల చదువు పట్ల పూర్తి నిర్లక్షం తొ వ్యవహరించడం వలన పిల్లల చదువు దెబ్బ తినే అవకాశం వుంది దీని వలన మోడల్ స్కూల్ లో పిల్లల్ని చేరిపించాలన్న తల్లిదండ్రుల ఆలోచన నిరాశగా మారుతుంది ఇది ఇలా ఉంటే ప్రతి ఏడాది స్కూల్ లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఆరవ తరగతిలో 100 మంది విద్యార్థులు వుండాల్సిన దగ్గర సరిపడ సంఖ్య లేదు ఉపాధ్యాయుల నిర్లక్ష్య దోరణి వలన ఈ సంవత్సరం ఇంకా అడ్మిషన్ లు తగ్గేలా కనబడుతున్నాయి ఆరవ తరగతి లో రెండు సెక్షన్ లు వుండాల్సిన చోట ఒక్కటే సెక్షన్ ఉండేలా ఉంది. ఏదేమైనా ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్ లకి పోటీగా నిలిచిన మోడల్ స్కూల్ దిన దినము ఇలా దిగజారిపోవటానికి కారణాలు ఏంటి అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలి మండల తల్లిదండ్రులకి ఆందోళన కలిగిస్తుంది. ఇలా పిల్లలని పిల్లల చదువు లని పట్టించుకోకుండా సమయ పాలన పాటించకుండా వ్యవహరించే అధ్యాపకులను మళ్ళీ అలాంటి నిర్లక్ష్య దోరణి పునరావృత్తం కాకుండా పిల్లల్ని పిల్లల చదువుల్ని పట్టించుకుంటారని ఆశిస్తున్నారు.