వచ్చే ఏడాది పాకిస్థాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కు టీం ఇండియా హాజరుకావడం లేదని తెలుస్తుంది.దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయి లేదా శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 09 వరకు ఈ ట్రోఫీ జరగనుంది .ఇప్పటికే షెడ్యూల్ ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖరారు చేసింది.పాకిస్థాన్ వెళ్లేందుకు బీసీసీఐ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చాలని బీసీసీఐ ఐసీసీను కొరనున్నట్లు తెలుస్తుంది.