Friday, November 22, 2024
spot_img

తీన్మార్ మోగాలే

Must Read
  • గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం
  • నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న
  • యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేసిన తీన్మార్
  • అవినీతి, అక్రమ పాలకుల అంతుచూసిన సీనియర్ జర్నలిస్ట్
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 80కిపైగా అక్రమ కేసులు
  • అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక
  • పేదల పక్షపాతై అహ్నరిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలి
  • గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతునై కొట్లాడుతానంటున్న మల్లన్న
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమా

తీన్మార్ మల్లన్న తెలంగాణలో ఈ పేరు వింటేనే ఓ సెన్సేషన్. వీ6 ఛానల్ లో ప్రసారమయ్యే “తీన్మార్ వార్తలతో ” తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తీన్మార్ మల్లన్న. తెలంగాణ యాస, పల్లెటూరి భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో వార్తలు చెప్పే మల్లన్న అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రాత్రి 9.30గం.లు అవుతుందటే చాలు అదీ తీన్మార్ వార్తల సమయం అనీ.. తెలంగాణ ప్రజలు మల్లన్న గొంతును వినడానికి టీవీలకు అత్తుకుపోయేవారు. ఆ తర్వాత పలు ఛానెల్స్ లో పనిచేశారు. అనంతరం సొంతంగా ‘క్యూ న్యూస్’ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని దానికి ప్రశ్నించే గొంతుక అనే ట్యాగ్ లైన్ తో పేద ప్రజల మనసులు దోచుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో బంధీ అయిపోయిందంటూ క్యూ న్యూస్ ఛానల్ ద్వారా గొంతెత్తి మాట్లాడాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మల్లన్న కంటిమీద కునుకు లేకుండా చేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు అడుగడుగునా ఎండగడుతూ ప్రతిరోజు పొద్దున్నే 8గం.లకు మార్నింగ్ న్యూస్ పేరుతో వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు చదువుతూ వాటిని విప్పి చెబుతూ ఒక్కొక్కరి బండారం బయటపెట్టాడు. అధికార, విపక్ష నాయకులకు ఏకు మేకై కూర్చొన్నాడు. పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఇతర డిపార్ట్ మెంట్ల ఆఫీసర్లను సైతం లైవ్ లో ఫోన్లు చేసి మర అర్సుకున్నాడు. పేదోడికి అన్యాయం జరిగి వెంటనే వాళ్ల పక్షాన కొట్లాడి అండగా నిలిచే యూట్యూబర్. అవినీతికి పాల్పడ్డ పాలకులు, నాయకులపై తన గళం ఎత్తి ప్రశ్నించినందుకు అనేక కేసులను ఎదుర్కొన్నారు. ఎక్కడ అవినీతి జరిగిన తనదైన శైలిలో ఆ అవినీతిని బయటపెట్టడంలో తీన్మార్ మల్లన్న దిట్ఠ. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడానికి ప్రధాన మీడియా ఛానళ్ళు జంకుతున్న సమయంలో దైర్యంగా గులాబీ లీడర్లు చేస్తున్న అక్రమాలను తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు వివరిస్తూ గులాబీ లీడర్లను ముప్పతిప్పలు పెట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించారు.

తీన్మార్ మల్లన్న పూర్తీ పేరు చింతపండు నవీన్ కుమార్. 1982లో జనవరి 17న యాదాద్రి భువనగిరి జిల్లాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఎ పొలిటికల్ సైన్స్ పూర్తీ చేశారు. ఇక ఎప్పుడు సామాన్యుల పక్షాన నిలబడడానికి ఇష్టపడే మల్లన్న అదే మక్కువతో 2015లో రాజకీయ ప్రవేశం చేశారు. తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏ మాత్రం పట్టుదల కోల్పోకుండా ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో నల్గండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించారు. గులాబీ పార్టీ తరుపున పోటీచేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించినంత పనిచేశాడు. ఓ కామన్ మెన్ అయి ఉండి.. స్వతంత్ర అభ్యర్థిగా డబ్బులు లేకున్నా ఎన్నికల్లో పోటీచేసి సెకండ్ ప్లేస్ లో నిలువడం చర్చకు దారితీసింది.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు :
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశారు. దీంతో రోజు రోజుకు ప్రజల్లో మల్లన్నకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనను టార్గెట్ చేసింది. జోతిష్యుడైన లక్ష్మికాంతారావును మల్లన్న డబ్బుల కోసం వేధిస్తున్నారని అక్రమ కేసులు నమోదైంది. దీంతో మల్లన్న 74 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన తన స్వరం వినిపిస్తున్నందుకు తన గొంతును అణచివేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసింది. కేసీఆర్ పై అనేక సందర్భాల్లో మల్లన్న విరుచుకుపడ్డారు. అనేకసార్లు తన క్యూ న్యూస్ పైన బీఆర్ఎస్ నాయకుల అనుచరులు దాడులు చేసిన ఏ రోజు సామాన్యుల పక్షాన తన స్వరం వినిపించడానికి తీన్మార్ మల్లన్న వెనుకడుగువేయలేదు.

నిరుద్యోగుల కోసమే తన గళం :
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినాక నిరుద్యోగుల సమస్యలు అలానే ఉన్నాయని, వాటిని పరిష్కరించే వరకు నిరుద్యోగుల పక్షాన అనేకసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ నీ బిడ్డకు ఎంపీ పదవి పోగానే ఎమ్యెల్సీ పదవి ఇచ్చుకున్నవ్ , నీ కొడుకుకు మంత్రి పదవి ఇచ్చావు.. మరి తెలంగాణ కోసం తన కుటుంబాలను, చదువులను సైతం పక్కన పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన నిరుద్యోగుల పరిస్థితి ఏంటని కేసీఆర్ కు తన లైవ్ ద్వారా సవాల్ విసిరారు. అనేకసార్లు ప్రభుత్వ హాస్టలల్లో విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు, బల్లులు రావడంతో బీఆర్ఎస్ నాయకుల్లారా ఇదే భోజనంను మీ పిల్లలకు తినిపిస్తారంటూ.. ప్రశ్నించారు.

తన పోరాటానికి దక్కిన ఫలితం :
బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులూ చేసిన తప్పిదాలను, నిరుద్యోగుల కోసం చేసిన కృషిని గమనించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరగబోయే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల కోసం తమ అభ్యర్థిగా మల్లన్నను ప్రకటించింది. దీంతో ప్రచారంలో జోరు పెంచారు. మల్లన్నకు ఎక్కడికి వెళ్లిన నిరుద్యోగులు “మేము మీ వెంటే” అంటున్నారని చాలా మంది కాంగ్రెస్ నాయకులూ చెబుతున్న మాట. ఇక తనని నల్గొండ-ఖమ్మం -వరంగల్ లో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపిస్తే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన వారి సమస్యలను గుర్తించి ఆ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు తన స్వరాన్ని వినిపించి న్యాయం చేస్తానని మల్లన్న అనేక సందర్భాల్లో వెల్లడించారు.

ఇదీలా ఉండగా ప్రశ్నించే గొంతుకను గెలిపించేందుకు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల ఇంఛార్జీలకు అల్టిమేటం ఇచ్చారు. 34 నియోజకవర్గాల్లోని పల్లె, పట్టణాల్లో తిరుగుతూ పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించి చట్టసభలకు పంపాలని కోరాలంటూ సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు సూచించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన మండలిలో మీ గొంతునై మాట్లాడుతానని ప్రచారంలో భాగంగా చెబుతూ వస్తున్నారు. అనేక రోజులుగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్లే ప్రయత్నం చేశారు తీన్మార్ మల్లన్న. నిరంతరం సామాన్యుల పక్షాన ప్రభుత్వాన్ని ఎదురించి, గత ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన వెనుకడుగు వెయ్యలేదని ఇలాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏదీ ఏమైనా పట్టభద్రుల ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో చూడాలంటే జూన్ 5వ తేదీ వరకు ఆగాల్సిందే.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS